విశాఖ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు షూలు,గొడుగులు పంపిణీ చేసిన డాక్టర్ వివేక్ వెంకటస్వామి

ఆగస్టు 16 (జనం సాక్షి )

చెన్నూరు పట్టణంలోని నల్లగొండ పోచమ్మ వాడలోకి ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులకు విశాఖ చారిటల్ ట్రస్ట్ ద్వారా “ఛత్రిలను” పంపిణీ చేశారు.అంతరం కోటపెల్లి మండలంలోని బబ్బరిచేలుక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి బాల బాలికలకు షూలు, సాక్షులు, పంపిణీ చేసినారు.
తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.బబ్బరి చెల్క ప్రభుత్వ పాఠశాలకు వివిధ గ్రామాలనుండి నిరుపేద విద్యార్థులునడుచుకుంటూ కాళ్లకు చెప్పులు లేకుండా వస్తున్నారని గమనించిన స్కూల్ హెడ్మాస్టర్ జాకీర్ హుస్సేన్, కాక ఫౌండేషన్ కు తెలియజేయగా.వారు చలించి ఈరోజు డాక్టర్ వివేక్ వెంకటస్వామి చేతులమీదుగా పాఠశాల విద్యార్థులకు షూలు పంపిణీ చేయటం జరిగిందని అన్నారు. గతంలో కూడా ఈ స్కూలుకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుండి బెంచిలు కూడా ఇవ్వటం జరగదని తెలిపారు. విద్యార్థులకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తెపిన వెంటనే విశాఖ ట్రస్ట్ ద్వారా
సేవలు అందిస్తామని డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు.అక్కడినుండి గ్రామ శక్తికేంద్రం అధ్యక్షుడు అసంపెల్లి నంద గోపాల్, ఇంట్లో తేనీరు విందు తీసుకొని అక్కడి ప్రజలతో మాట్లాడటం జరిగింది.
కార్యక్రమం లో బీజేపీ నేతలు అందుగుల శ్రీనివాస్, వెంకటేశ్వర్ గౌడ్, రమేశ్, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్,ఆసం పెల్లి, నదకిశోర్,శంకర్, రఘు నందన్ రెడ్డి, రాజు, శివకృష్ణ, శ్రీకాంత్, సంతోష్, ప్రవీణ్ నాయక్, ప్రవీణ్, వేల్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.