వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపిన ఎస్ డబ్ల్యు ఎఫ్ రాష్ట్ర నాయకులు.

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 11 రాయికోడ్ 75వ రాయికోడ్  మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు 18 రోజులుగా వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు స్టాఫ్ వర్కర్స్ ఫెడరేశాన్ రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ సంఘీభావం ప్రకటించి వారితో పాటు నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ మేరకు గురువారం వారి తరపున నిరవధిక సమ్మె వద్దకు వెళ్లి సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం గత 23 నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి వేతనాలను నిర్ణయిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చినప్పటికీ దాన్ని ఇంత వరకు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం చిరు ఉద్యోగుల పట్ల చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని విన్నవించారు. వెంటనే విఆర్ ఏలకు ఇచ్చిన హామీలను అమలు పర్చాలని అర్హులైన గ్రామ సేవకులకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు జీపీ రత్నం, ఉపాధ్యక్షుడు శివకుమార్, శ్రీశైలం, గోపాల్, మహిళ విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.