వ్యవసాయ విధానంపై రైతుల్లో చైతన్యం రావాలి
రైతు సంక్షోభంపై ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు మెల్లగా మాట్లాడుతున్నాయి. అటు కేంద్రం ఇటు రాష్టాల్రు ఈ సమస్యలపై చర్యలకు పూనుకుంటున్న తీరు అభినందనీయం. దేశంలో తీవ్ర కరవు సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక వ్యవసాయ విధానంరా వాలి. దేశంలోని రాష్టాల్రు, జిల్లాలు, మండలాల వారీగా నీటి లభ్యత, సాగుకు అనుకూలమయ్యే పంటలను గుర్తించి రైతులను చైతన్యం చేయాలి. ఏ పంటలు ఎక్కడ పండించాలో చేయాలి. రైతులు ఖచ్చింతంగా ఫలానా పంటలు ఆత్రమే వేయాలన్న నిబంధన లేద ఆసూచనలు లేకపోవడం వల్ల రైతులు ఎవరికి వారు తమకు తోచిన విధంగా వ్వయసాయం చేస్తూ , అదృష్టం ఉంటే లాభం లేకుంటే నష్టం పొందుతున్నారు. ఇదంతా ఓ జూదంలా సాగుతోంది. ఎక్కడ ఏ పంటలు వేయాలో తెలియక ఇష్టం వచ్చినట్లుగా మార్కెట్లో విత్తన మాఫియా రాజ్యం ఏలుతోంది.ఇలా తెలంగాణలో పత్తి వేసిన రైతులు భారీగా నష్టపోయారు. అలాగే నీళ్లు లేకున్నా వరి వేసిన రైతులు నష్టపోతున్నారు. కాలువల కింద కూడా నీటికి గ్యారెంటీ లేక గోదావరి జిల్లాల్లో తీవ్రంగా నస్టపోయారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా, ఉల్లి, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందిస్తున్నది. అదేవిధంగా రాష్ట్రంలో అపరాల విస్తీర్ణం పెంచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మన నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతతో అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయని వ్యవసాయశాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణలోని ఎనిమిది గ్రావిూణ జిల్లాలు కంది, పెసర పంటల సాగుకు అనుకూలం. రాష్ట్ర ప్రభుత్వం సైతం అపరాల సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పప్పుధాన్యాల దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో అపరాల సాగును ప్రోత్సహించేందుకు 2016ను అపరాల సంవత్సరంగా యూఎన్‌ఓ ప్రకటించింది. అనేక ప్రత్యామ్నాయ పంటలపై రైతు దృష్టి మర్చేలా యుద్ధప్రాతిపదికన వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇకపోతే వ్యవసాయం యావత్తూ కరెంట్, నీటి లభ్యత ఆధారంగా సాగుతోంది. నీరుంటే వరి మాత్రమే వేయాలన్న ధోరణి రైతుల్లో ఉంది. చెరువుల్లో నీరు లేక కబ్జాలకు గురికావడంతో చిన్ననీటి పారుదల రంగం చిన్నబోయింది. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో వ్యవసాయం భారంగా మారింది. ఉపాధి కోసం వ్యవసాయం చేస్తున అన్నదాతలు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఈ విధానం మారితేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందనడంలో సందేహం లేదు. వ్యవసాయం రైతులకు సంబంధించన వ్యసంగంగా మారింది. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలి. నీటి లభ్యత, విద్యుత్ సౌకర్యం, భూముల నాణ్యత ఆధారంగా ఏ పంటలు వేయాలో నిర్ణయించి రైతును చైతన్యంగా ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ప్రధాని మోడీ కూడా వ్యవసాయంపై మార్పురావాలని అభిలషిస్తున్నారు. ఈ దశలో వ్యవసాయంపై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని పంటలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏవి వేయాలన్న బాధ్యతలను వ్యవసాయశాఖ తీసుకోవాలి. ఇది అన్ని ప్రాంతాలకు అవసరం. ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు సాగు చేయకుండా రెగ్యులేషన్ ద్వారా వ్యవసాయం సాగాలి. ఇందుకు తక్షణ అవసరంగా సోలార్ విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయాలి. సోలార్ ఉత్పత్తిని పెంచాలి. ఎక్కడిక్కడ గ్రామానికో సోలార్ విద్యుత్ లేదా వ్యవసాయ అవసరాలకు ప్రత్యేక సోలార్ వ్యవస్థ ఏర్పాటు అవసరం. ప్రస్తుతమున్న విద్యుత్ కొరతను అధిగమించేందుకు సౌర విద్యుదుత్పత్తి ఒక్కటే ఉత్తమమార్గమని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడుతున్నది. ఇది ఓ మంచి ఆలోచన. ఇలా గ్రామాల్లో సోలార్ వినయోగాన్ని విప్లవాత్మకంగా యుద్దప్రాతిపదికన చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం
ఇటీవల దేశవ్యాప్తంగా లక్ష పంపుసెట్లకు సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్టాల్ల్రో పంపుసెట్లకు సౌరవిద్యుత్ అందించేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి. దీనిని ఎంతత్వరగా చేపడితే అంతమంచిది. అలాగే రైతులను నిరంతరం చైతన్యం చేసే కార్యక్రమం చేయాలి. గ్రామస్థాయిలో విద్యుత్ లభ్యత, నీటి లభ్యతను ఆధారం చేసుకుని పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలి. అనవసరంగా రైతులు వీధుల్లోకి ఎక్కి ధర్నాలు చేయకుండా కార్యాచరణ రూపొందించాలి. ఇప్పటికే ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రధాని చేసిన సూచన గ్రామస్థాయికి చేరుకోవాలి. వర్షాలు లేక ప్రాజెక్టుల నీటిమట్టాలు అడుగంటాయి. బోర్లు, బావుల్లో నీరు ఆడుగంటి పోయింది. మరోవైపు విద్యుత్తు కోతలు వెంటాడుతున్నాయి. విత్తనాలను అడిగే రైతులే లేరు. దీనిని బట్టి సాగు పూర్తిగా తగ్గిపోనుందని స్పష్టమవుతోంది. ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులు రాక, గిట్టుబాటు ధర లేక, నష్టపోయారు. దీనికి తోడు బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించారు. చేసిన అప్పు తీర్చలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వర్షభావ పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ ప్రణాళిక తారుమారు అవుతోంది. దీనితో ఇప్పటికైనా వ్యవసాయ విధానంలో గ్రమాస్థాయి ప్రణాళికలకు చోటు కల్పించాలి.