సమస్యల పరిష్కారానికే గ్రామ సందర్శన
విజయనగరం జూన్ 30 : గ్రామాల్లోని సమస్యలు పరిష్కరానికే గ్రామ సందర్శన నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి పి.నారాయణస్వామి తెలిపారు. మండలంలోని శాతంవలస గ్రామంలో గ్రామసందర్శన జరిగింది. ముందుగా పాఠశాలలను , అంగన్వాడీ కేంద్రాలను , రేషన్ డిపోలను పరిశీలించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. గ్రామసభలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డి.పెంటయ్య, ఏవో ఎస్.సూర్యకుమారి, ఆర్‌ఈసీఎస్ ఏఈ నాగభూషన్, అధికారులు పాల్గొన్నారు.