సమైక్యాంధ్ర సమితి సమావేశాన్ని అడ్డుకున్న టీజీవీపీ
హైదరాబాద్: హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సమితి సమావేశాన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్ అడ్డుకుంది. ఈ నెల 30న నిర్వహించే తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలనే డిమాండ్‌తో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీజీవీపీ నేతలు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకోంది. నగరంలో పెద్దఎత్తున జరిగే జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో తెలంగాణా మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని సమావేశం నిర్వహించటానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులును అదుపులోకి తీసుకున్నారు.



