సెమీస్‌లో భారత్‌

      

వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం
లండన్‌, (జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫిలో భారత జట్టు సెమిస్‌ ఫైనల్‌కు చేరుకుంది. వెస్టిండిస్‌తోజరిగిన ఒవరాల్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. 233 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బారత్‌ కేవలం 39.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 233 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌, శిఖర్‌ ధావన్‌లు శుభారంబాన్నందించారు. మొదటి మ్యాచ్‌లో సెంచరీతో రాణించన ధావన్‌ రెండో మ్యాచ్‌లోనూ తన జోరును కొనసాగించాడు. శిఖర్‌ ధావన్‌ 102 పరుగులతో నాటౌట్‌,  రోహిత్‌ శర్మ 52 పరుగులు, కార్తిక్‌ 51 పరుగులు నాటౌట్‌, కోహ్లి 22, చేశారు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోను బౌలర్లు సత్తా చాటారు. జడేజా 10 ఓవర్లలో కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. భువనేశ్వర్‌ కుమార్‌, యాదవ్‌, శర్మలు తలో వికెట్‌ తీశారు. 5 వికెట్లు తీయడం జడేజా కిది మొదటిసారి. వెస్టిండిస్‌ బ్యాటింగ్‌లో ఓపెనర్లు ఊపందుకునేప్పుడే భవనేశ్వర్‌ కుమార్‌ గేల్‌ను 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్‌ చేశాడు. చార్లెస్‌ దూకుడుగా ఆడి 55 బంతుల్లో 60 పరుగులు చేశాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్చాట్స్‌మెన్‌ రాణించడంతో స్కోరు 200 దాటింది. స్మిత్‌ 35, బ్రావో 25, పోలార్డ్‌ 22, సమీ కేవలం 35 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండిస్‌ బాలింగ్‌లో నరైన్‌ 2 వికెట్లు తీశాడు. మిగతా ఏ ఒక్కరికి ఒక్క వికెట్‌ కూడా లభించలేదు. సెంచరీతో చెలరేగిన ధావన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.