104,108 సేవలపై సర్వే 104,108 సేవలపై సర్వే

104,108 సేవలపై సర్వే
శ్రీకాకుళం, జూలై 12 (: జిల్లావ్యాప్తంగా 104, 108 వాహనాల వైద్య సేవల పనితీరుపై హైదరాబాద్‌కు చెందిన ఐఎంఆర్‌బి సంస్థ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పొలాకి మండల పరిధిలోని దీర్గాశిలో ఆ సంస్థ ప్రతినిధి డి.కిశోర్‌ ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. 104, 108 వాహన సేవలు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయంపై వివరాలు సేకరించి, నమోదు చేస్తున్నారు. ఐఎంఆర్‌బి స్వచ్ఛంద సంస్థ ద్వారా 20 మంది, క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామ జనాభా, ఆరోగ్య సిబ్బంది సేవలు, వాహన సేవలు, అత్యవసర సమయంలో 108 అంబులెన్స్‌ ప్రజలకు ఉపకరిస్తుందా లేదా.. ప్రాణాపాయ స్థితిలో ఆదుకుంటుదా లేదా.. మరణాలు సంభవించాయా.. ప్రాణం కాపాడిందా.. అనే విషయాలపై సమగ్ర అభిప్రాయాలను సేకరిస్తున్నారు. పంచాయతీ పరిధిలో 200 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి ఉన్నత అధికారులకు పంపిస్తామని ఆ సంస్థ ప్రతినిధి కిశోర్‌ చెప్పారు. ఆయన వెంట అంగన్‌వాడీ కార్యకర్త రాజు, ఆశా కార్యకర్త విజయ తదితరులు ఉన్నారు.