13మంది మృతదేహాల వివరాలివే..

నెల్లూరు, జూలై 31 : సోమవారం నాటి దుర్ఘటనలో మరణించిన 13 మృతదేహాలను వారి బంధువులకు రైల్వే అధికారులు మంగళవారం ఉదయం అప్పగించారు. షాలిని (23), ఎస్‌.జస్వని (23), ఎన్‌.జగన్నాథన్‌ (45), పల్లవి (49), వెంకటరమణ (60), నాగారాణి (52), ఎలిజిబెత్‌ (53), పొన్నమయి
(56), తబమణి (25), రోజీమేరి (5), జాస్‌మిరే (3), రిహాద్‌ అహ్మద్‌ (42), రావూఫ్‌ (25)లను వారి బంధువులకు అప్పగించారు. ఈ ప్రకారం మృతుల కుటుంబ సభ్యులకు కేంద్రం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా అందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందిలా ఉండగా విజయవాడ నుంచి వచ్చిన ఒక కుటుంబం తమ బంధువు మృతదేహం కోసం అధికారులను సంప్రదించగా వారు నిర్ద్వద్వంగా తిరస్కరించారు. చెన్నయ్‌లో డిఎన్‌ఎ పరీక్షలు పూర్తి చేసుకుని ఆ నివేదికను పరిశీలించాకే మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పినట్టు తెలిసింది.