15 రోజులపాటు బిజెపి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17. శ్రీ దీన్ దయాల్ ఉపాధ్యాయులు గారి జన్మదినం సెప్టెంబర్ 25. మహాత్మా గాంధీ జన్మదిన అక్టోబర్ 2. ఈ ముఖ్యమైన రోజులను ఉద్దేశించి 15 రోజులపాటు సేవా కార్యక్రమాలు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందని బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి అన్నారు. అందులో భాగంగానే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు గ్రామంలో బిజెపి నాయకులు బల్ల శ్రీనివాస్. బిజెపి కట్కూరు శాఖ ఆధ్వర్యంలో ఎస్ ఎం ఆర్ హాస్పిటల్ బోడుప్పల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో శ్రీ వైద్యనిపులు. ఎముకల వైద్య నిపుణులు. జనరల్ మెడిసిన్ డాక్టర్. గుండె వైద్య నిపుణులు పరీక్షలు జరపగా. షుగర్. బిపి. ఈసీజీ. మరియు ఇతర పరీక్షలు సుమారు 500 మంది పేషెంట్లు వారి యొక్క వివిధ సమస్యలను డాక్టర్లకు చెప్పి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి. జిల్లా ఉపాధ్యక్షులు బేజా డి బీరప్ప. రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి. జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యం. మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్. యువ మోర్చా మండల అధ్యక్షులు బంగారు మహేష్. కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఉమ్మెత్తల మల్లారెడ్డి. దబగుటపల్లి సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి. కొడవటూరు ఎంపీటీసీ నీల శైలజ రమేష్. యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి గద్దరాజు. బూతు అధ్యక్షులు కదునూరి పాండు. గుడ్ల మల్లయ్య. శివకుమార్. బాల నరసయ్య. బాల్రెడ్డి. నాగరాజు. పరశురాములు. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు