16 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం

ఖమ్మం, జూలై 23 : జిల్లాలోని వైరా రిజర్వాయర్‌ సోమవారానికి 16 అడుగులకు చేరింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెలవెలబోతున్న వైరా రిజర్వాయర్‌ 16 అడుగులకు నీరు చేరి నిండుగా కళకళలాడుతోంది. మరో 2.2 అడుగులకు నీరు వస్తే వైరా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్టవుతుంది. క్రమక్రమంగా వైరా రిజర్వాయర్‌కు నీరు చేరడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.