18మందికి పదోన్నతులు
కడప, ఆగస్టు 3 : జిల్లాలోని 18 మంది డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ ప్రాతిపదికన ఈ పదోన్నతులు కల్పించామని చెప్పారు. ఖాళీలుగా ఉన్న మండలాల్లో వీరిని నియమించనున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వీరికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది.