23న మక్తల్ లో జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపికలుసిపిఐ(ఎం-ఎల్) ఎన్డీ కేంద్ర కమిటీ సభ్యుడు ముఖ్తార్ పాష 2వ వర్ధంతి సభని విజయవంతం చేయండి
టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి ): సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు, భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముఖ్తార్ పాష 2వ వర్ధంతి సభ గోడపత్రికను బుధవారం టేకులపల్లి మండల కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్ ) న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి బాణొతు ఊక్లా మాట్లాడుతూ ముక్తార్ పాష విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడై పిడిఎస్యు లో చేరి పని చేస్తున్నా క్రమంలోనే ప్రజలకై పని చేయాలని ఉన్నత చదువును వదిలి, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా చేరాడని క్రింది స్థాయి కార్యకర్త నుండి అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూ అంచలంచలుగా ఎదిగాడని సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యునిగా, భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. నీటిలో చాప వలే, తలలో నాలిక వలె నిత్యం ప్రజల మధ్యనే ఉండేవాడని బయ్యారం, ఇల్లందు ప్రాంతాలలో అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేస్తూ కార్మిక సంఘాలను నిర్మించారు. భూమి లేని నిరుపేదలకు పోడు భూమిగా బాసటై నిలిచారని ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక ప్రజా ఉద్యమాలకు ఆద్యం పోసాడని తన విప్లవ ప్రస్థానంలో తన సహచరులు ఎన్కౌంటర్లో అమరులవుతున్నప్పటికీ విప్లవోద్యమం తోనే తన ప్రయాణం అంటూ సాగాడని నిర్బంధ కాలంలో మొక్కవోని ధైర్యంతో నిలబడ్డాడని ఉద్యమాలను నిలబెట్టాడని తన చివరి శ్వాస వరకు ఉత్తమ కమ్యూనిస్టుగా జీవించాడని సెప్టెంబరు 24- 2020 నా కరోనా వ్యాధికి బలి అయ్యాడని కామ్రేడ్ పాషన్న అమరత్వం విప్లవోద్యమానికి, ప్రజా ఉద్యమానికి, కార్మిక ఉద్యమానికి తీరనిలోటని, ఈ క్రమంలోనే పాషన్న ని స్మరించుకుంటూ ఈనెల 24వ తారీఖు