3కోట్లతో ఉడాయించిన చిట్టీ వ్యాపారులు
నిజామాబాద్,ఆగస్టు17(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లాలో చిట్టీ వ్యాపారులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దాదాపు మూడు కోట్లగా పైగా టోకార వేసి చిట్టీ వ్యాపారులు ఉడాయించారు. కట్ట రవి, దినేష్, వాసు గౌడ్ కలిసి తమ స్నేహితులు, బంధువుల వద్ద చిట్టీల పేరిట వసూలు చేసి … మెచూరిటీ సమయానికి డబ్బుతో పరారయ్యారు. ప్రధాన వ్యాపారి రవి ఏకంగా ఇంటిని అమ్ముకొని పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.