38వ రోజుకు చేరిన వీఆర్ఏ ల దీక్షలు! గణపురం( ము
ఆగస్టు 31 జనం సాక్షి: గణపురం మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు నిరావధిక సమ్మె దీక్షలు 38వ రోజుకు చేరింది. సమ్మెలో మండలం లోని వీఆర్ఏల నిరావధిక సమ్మె దీక్ష శిబిరం వద్ద కార్యచరణ కార్యక్రమంలో భాగంగా వీఆర్ఏలు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని వీఆర్ఏల దీక్ష శిబిరం వద్ద కూర్చుని నినాదాలు చేస్తూ నిరసనలు తెలియపరచినైనది. అనంతరం వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు చెన్నూరు సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలను చట్టసభల్లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినరన్నారు. వీఆర్ఏలు చేస్తున్న నీరావధిక సమ్మె బుధవారానికి 38వ రోజు చేరుకుంద న్నారు. తెలంగాణ రాష్ట్ర మంతట 23 వేల మంది వీఆర్ఏలు ఉన్నారని ప్రతి మండలా తహసిల్దార్ కార్యాలయాల ఎదుట కూర్చొని 38 రోజు లు కావస్తున్న ఈరోజు వరకు ఈ ప్రభుత్వం వీఆర్ఏల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు . వీఆర్ఏల కోరికలు న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేసి జీవోలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ లు మోటపోతుల సురేందర్, బూర చేరాలు ,గుడాల తిరుపతి పసునూటి మమత తదితరులు పాల్గొన్నారు.