నా దెబ్బకు బ్రిక్స్‌ కూటమి బెంబేలెత్తింది

` సుంకాలు విధిస్తామనగానే చెల్లాచెదురయ్యారు
` ట్రంప్‌ వ్యంగ్యాస్త్రాలు
న్యూయార్క్‌(జనంసాక్షి):బ్రిక్స్‌ కూటమి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా అదే తరహాలో మాట్లాడారు. సుంకాలు విధిస్తామనగానే ‘బ్రిక్స్‌’ చెల్లాచెదురైందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ‘’డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకొస్తే బ్రిక్స్‌పై 150 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పగానే అందులోని దేశాలు పరస్పరం దూరం జరిగాయి. తర్వాత ఆ కూటమి మాటే వినిపించడం లేదు’’ అని విమర్శించారు. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్‌, యూఏఈ.. ఈ గ్రూప్‌లో సభ్య దేశాలు.యూఎస్‌ డాలర్‌ను పక్కనపెడితే ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. డాలర్‌కు బదులుగా బ్రిక్స్‌ దేశాలు మరో కరెన్సీని సృష్టించలేవన్నారు. ఒకవేళ వారు డాలర్‌ను వదులుకుంటే అద్భుతమైన యూఎస్‌ ఎకానవిూలో అమ్మకాలకు గుడ్‌బై చెప్పి.. ఆయా దేశాలు ప్రయోజనం పొందడానికి మరో దేశాన్ని ఎన్నుకోక తప్పదని ట్రంప్‌ (ుతీబీఎజూ) పేర్కొన్నారు. శక్తిమంతమైన అమెరికా డాలర్‌కు బదులుగా బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని, అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని గతంలో హెచ్చరించారు.గత అక్టోబరులో రష్యాలోని కజాన్‌ వేదికగా బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై దృష్టిపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పిలుపునిచ్చారు. పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఆయా దేశాలు డిజిటల్‌ కరెన్సీని వాడుకోవాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్‌ కరెన్సీ వాడుకునేందుకు భారత్‌తో కలిసి రష్యా పని చేస్తోందన్నారు. సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్‌ కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. కాగా అట్లాంటిక్‌ కౌన్సిల్‌కు చెందిన జియో ఎకనామిక్స్‌ సెంటర్‌ గత సంవత్సరం చేసిన అధ్యయనంలో బ్రిక్స్‌ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్‌పై ప్రపంచ దేశాలు ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించలేవని వెల్లడిరచింది.