4 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం
విజయవాడ, జూలై 18: అక్రమంగా నిల్వ చేసిన నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్లలోని ఒక వ్యాపారి ఇంట్లో ఈ బియ్యాన్ని దాచి ఉంచినట్లు సమాచారం అందడంతో పౌర సరఫరాల శాఖ దాడులు చేపట్టింది. వీరి దాడుల్లో నాలుగు క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టుబడింది. ఎక్కడి బియ్యం తెచ్చి దాచావని వ్యాపారిని పోలీసులు విచారించగా మైలవరం నుంచి ఈ బియ్యం తనవద్దకు వచ్చినట్టు, వీటిని కాకినాడకు పంపే ఏర్పాట్లు చేస్తుండగా దొరికిపోయినట్లు సమాచారం.