5 కే రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్..
ధర్మపురి (జనం సాక్షి) I VOTE FOR SURE అనే నినాదంతో శనివారం ఉదయం వివేకానంద కూడలి వద్ద అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ధర్మపురి పరిధిలో ఎస్సీ కాన్స్టెన్సీ నియోజకవర్గం లో శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు మేరకు అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, పోలీస్ శాఖ ప్రజాపరిషత్, ఆరోగ్యశాఖ విద్యా సంస్థలతో పాటు 5k,రన్ అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు వివేకానంద నుండి పటేల్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, పైలాన్, అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వరకు ఓటు నినాదాలతో హోరెత్తించారు,కాలేజీ గ్రౌండ్లో ఇండియా సర్కిల్ గా నిలబడి ప్రతిజ్ఞ చేయించారు నినాదాలతో పబ్లిక్ ను చైతన్యవంతం చేసిన తదనంతరం అదనపు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ధర్మపురి నియోజకవర్గాలలో ఓటింగ్ పై విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో I VOTE FOR SURE అనే నినాదంతో 5K రన్ లో ధర్మపురి పట్టణ కేంద్రంలో ప్రజలకు అవగాహన కోసం ఈ
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుంది అని డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని,
ఓటు ప్రజాస్వామ్యానికి పునాదిఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసిన అభ్యర్థులను “ఓటర్లు” అని పిలుస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తేమ్మ, జడ్పిటిసి బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, వైస్ చైర్మన్ అక్కని పెళ్లి సునీల్ కుమార్ మరియు వివిధ జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు జడ్పిటిసిలు 5కే. రన్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.