6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి

రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.. బంటు

మిర్యాలగూడ. జనం సాక్షి
సాగర్ ఎడమ కాల్వకు పూర్తిస్థాయిలో నీటి విడుదల చేసినప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు అన్నారు.. బుధవారం యాద్గారి పల్లి గ్రామంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిడమనూరు మండలం ముప్పారం గ్రామం వద్ద ఎడమ కాలువకు గండి పడి అధికారులు నీటి విడుదల ఆపేశారని దీంతో 40% పంట పొలాలు నీరంధక ఎండిపోయాయని వాపోయారు మంగళవారం ప్రభుత్వం 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి చేతులు దులుపుకుందని.. ఎండిపోతున్న పంటలను కాపాడాలంటే 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు అరకొరగా నీటి విడుదల చేయడం వల్ల రైతుల మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం ఉందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి ఎడమ కాలువకు పూర్తిస్థాయిలో నీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు