యుఇఎఫ్‌ఎ అవార్డ్ రేసులో మెస్సీ,రొనాల్డో
స్విట్జర్లాండ్ ,జూలై 10 (జనంసాక్షి):యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఇచ్చే బెస్ట్ ప్లేయర్ అవార్డ్ కోసం ఈ ఏడాది గట్టి పోటీ నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రేసులో స్టార్ ప్లేయర్స్ లైనోల్ మెస్సీ , క్రిస్టియానో రొనాల్డో పోటీపడుతున్నారు. వీరితో పాటు థామస్ ముల్లర్ , ఫ్రాంక్ రైబెరీ , బాస్టియన్ షెవిన్‌స్టీగర్ కూడా రేసులో ఉండడం విశేషం. యుఇఎఫ్‌ఎలో సభ్యులుగా ఉన్న దేశాల జర్నలిస్టులు ఈ జాబితాను తయారు చేస్తారు. తొలిసారి డిఫెండర్లు , గోల్‌కీపర్లు లేకుండానే లిస్ట్ ప్రకటించడం విశేషం. 2011లో ఈ అవార్డు గెలుచుకున్న మెస్సీ మరోసారి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. అలాగే రియల్ మాడ్రిడ్ టాప్ స్కోరర్ రొనాల్డో అతనికి గట్టిపోటీనిస్తున్నాడు. విజేతను కూడా జర్నలిస్టుల ఓటింగ్ ద్వారానే నిర్ణయిస్తారు. ఆగష్ట్ 29న ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ స్టేజ్ డ్రా సందర్భంగా మొనాకోలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును విజేతకు అందజేయనున్నారు.