మాథ్యూస్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
దుబాయి జూలై 15 (జనంసాక్షి): భారత్ ముక్కోణపు సిరీస్ ఫైనల్లో స్లో ఓవర్ రేటు కారణంగా శ్రీలంక కెప్టెన్ మ్యాథ్యూస్ పై రెండు వంన్డేల నిషేదం వేటు పడింది. మిగితా లంక జట్టు సభ్యులకు జరిమానాగా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించినట్లు ఐసిసి తెలిపింది. నిర్ణిత గడువులో శ్రీలంక మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించి మ్యాచ్ రిఫరీ బూన్ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి ఆరు బంతుల్లో 15పరుగులు చేయాల్సి ఉండగా భారత్ కెప్టెన్ ధోని విరోచితంగా ఆడి భారత్‌కు విజయాన్ని సాధించి పెట్టాడు. మాథ్యూస్ తన తప్పును అంగీకరించాడు. దీంతో విచారణ అవసరం లేకుండా పోయింది. ఆన్‌ఫీల్డ్ అంపైర్లు నిగెలి లోగ్, పీటర్ నీరో, థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్ నిగెల్ దుగుయెడ్ అభియోగాలు మోపారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఈనెల 20న ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌తో మాథ్యూస్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈనెల 20, 23తేదీల్లో దక్షిణాఫ్రికాతో జరిగే రెండు వన్డే మ్యాచులకు అతను దూరంగా ఉంటాడు.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహిస్తున్న చోట ఓ చిన్నారి విన్యాస