తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది


సీమాంధ్రులు సహకరించాలి
తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలి : బొత్స
హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారం భమైందని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ ప్రాంత నేతలతో బొత్స సమావేశమ య్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తదితరులు హాజరయ్యారు. ఆంటోనీ కమిటీ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబా ద్‌ రానున్న తరుణంలో నిర్వహించిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు. తెలంగాణ అంశం సహా సీమాంధ్ర లో కొనసాగుతున్న ఉద్యమాలు, తదితర పరిణామాలపై చర్చించారు. దిగ్విజయ్‌సింగ్‌ ఎదుట వినిపించాల్సిన వాదనలపైనా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రక్రియలో భాగంగా కేబినెట్‌ నోట్‌, పార్లమెంట్‌లో బిల్లు తదితర అంశాలపైనా నేతలు ఆరా తీసినట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న హడావుడిపై జానారెడ్డి తదితరులు ఈ భేటీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరి స్తున్నారని, విడిపోయే సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని బొత్సకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే, బొత్స వారికి సర్ధిచెప్పినట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైం దని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని ఆయన కోరారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని, అందులో తప్పు లేదని వివరించారు. అయితే, జానా కాస్త గట్టిగానే మాట్లాడినట్లు సమాచారం. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించడం లో తప్పు లేదని, అయితే, ఇతర ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బొత్స జోక్యం చేసుకుంటూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. అది పూర్తయ్యే వరకూ సంయమనం పాటిద్దామని కోరినట్లు సమాచారం. ఎవరు రెచ్చగొట్టేలా మాట్లాడినా ఓపికతో ఉండాలని, ఆవేశపడొద్దని సూచించారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రజలు సంమయనం పాటించాలి : బొత్స

పంపకాలు తదితర అంశాలపై దిగ్విజయ్‌సింగ్‌కు వివరించాలని తెలిపారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న తెలంగాణ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని..19న తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆంటోనీ కమిటీతో సమావేశమవుతారని చెప్పారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానాన్ని యథావిధిగా అమలు చేయాలని కమిటీకి నివేదిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే అవకాశం ఉండదని వారు విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.