భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

ఆ సందర్భంగా అవధ్‌లోని ప్రజలనుద్దేశించి బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకట నలో, ‘హిందూ-ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలనలో, స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు. కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. స్త్రీల మీద అఘాయిత్యాలకు, అత్యాచారాలు జరుపు తున్నారు. హిందూ-ముస్లిం పౌరులను హెచ్చరిస్తున్నాం. ఆత్మ గౌరవంతో, ధర్మబద్దంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి, స్వదేశీ సైన్యంలో భర్తీకండి. మాతృదేశం కోసం సాగుతున్న పోరాటంలో భాగస్వాములు కండి. శత్రువుకు సహరిం చకండి, ఆశ్రయం ఇవ్వకండి.’ అంటూ బేగం హజరత్‌ మహాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో ఉత్తేజితులైన ప్రజలు, సైనికాది óకారులు, అంతవరకు ఆమెకు దైరంగా ఉన్న స్వదేశీ పాలకులు, అధికారులు బేగం పతాకం నీడన చేరుకున్నారు. (భారత్‌కి స్వాతంత్ర సంగ్రామం మే ముస్లిం మహిళావోంకా మోగ్‌దాన్‌, (హిందీ) – డాక్టర్‌ అబెదా సమీయుద్దీన్‌, ఇన్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢిల్లీ, 1977)

ఈ మేరకు పరిస్థితులు మరింత అనుకూలించి ప్రశాంత వాతావరణం ఏర్పడడంతో, అవధ్‌ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేం దుకు బేగం నడుం కట్టారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ఫలితం గా పలు ప్రాంతాల నుండి లక్నోకు తరలి వస్తున్న తిరుగుబాటు యోధులకు, వేలాది సైనికులకు ఆమె ఆశ్రమం కల్పించాల్సి వచ్చింది. ప్రముఖ తిరుగుబాటు నాయకులు నానా సాహెబ్‌ పీష్వా, జనరల్‌ బక్త్‌ ఖాన్‌ రొహిల్లా, మొగల్‌ రాజకుమారుడు ఫిరోజ్‌ భారీ సైనిక బలగాతో లక్నో చేరుకుంటున్నారు. ఈ నేతలకు, ఆ నేతలకు పరవారానికి, వారి సైన్యాలకు వసతి ఈ నేతలకు, ఆ నేతల పరివారానికి, వారి సైన్యాలకు వసతి సౌకర్యాలు సమకూర్చటం బేగంకు కడుభారంగా మారింది.

ఈ పరిస్థితులు ఖజానా మీద అధిక భారమయ్యాయి. చివరకు ఖజానా ఖాళీ అయ్యింది. ఆమె వ్యక్తిగత సంపద కూడా ఖర్చయి పోయింది. గత్యంతరం లేని పరిస్థితులలో ధనికులు, సంపన్నవర్గాల మీద యుద్ధపన్ను అంటూ ప్రత్యేక పన్ను విధించారు. ఆ నిర్ణయానికి సహజంగా మిశ్రమ స్పందన లభించింది. ఆ విధంగా సమకూరిన ధనం కూడా సరిపోక పోవడంతో ఆమె అధికారులు కొందరు తిరు గుబాటు వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్న సంపన్నుల కుటుం బా ల నుండి బలవంతంగా ధన సంపదలను వసూలు చేయసాగా రు. ఆనాటి క్లిష్ట పరిస్థితులలో కూడా బేగం హజరత్‌ మహాల్‌ ఎంతో బుద్ది కుశలతతో ఆర్థిక వ్యవహరాలను చక్కదిద్దుకుంటూ, ఆంగ్లే యులను ఎదుర్కొనేందుకు సైనికంగా సన్నద్దులు కాసాగారు.  ఈ మేరకు 1,80,000 మంది సైనికులను ఆమె సమకూర్చు కున్నారు. బ్రిటిషు బలగాలతో ఢీ అంటే ఢీ అనడానికి సిద్దమయ్యా రు.

ఈ పరిస్థితులను గమనించిన బ్రిటీష్‌ అధికారి విలియం రస్సెల్‌, బేగం మాతో అప్రకటిత యుద్ధం ప్రారంభించింది. ఈ రాణులు, బేగంల శ్లాఘనీయ, శక్తివంత చరిత్రలను గమనించాక, అంతపు రంలో పర్ధాల చాటున ఉంటూ కూడా ఎంతటి శక్తి యుక్తులు సంతరించుకోగలదో తెలుసుకున్నాం. అని వ్యాఖ్యానించాడు. (భారత్‌కి స్వాతంత్ర సంగ్రామం మే ముస్లిం మహిళావోంకా యోగ్‌దాన్‌)

మరో ప్రముఖ చరిత్రకారుడు హెచ్‌ బేవేర్జ్‌ 1857 నాటి తిరుగుబాటుకు బేగం ఆత్మలాంటిది. అని హజరత్‌ మహాల్‌ను ప్రస్తుతించారు. (ూ షశీఎజూతీవష్ట్రవఅరఱఙవ నఱర్‌శీతీవ శీట Iఅసఱa, న. దీవఙవతీఱసస్త్రవ, 1887 జుణ హశీశ్రీ. జూaస్త్రవ 842 ుబశ్‌ీవస పవ వీతీ. ూతీఱఙaర్‌ష్ట్రaఙవ ఱఅ ష్ట్రఱర పశీశీస ఖీతీవవసశీఎ ఖీఱస్త్రష్ట్ర్‌వతీర శీట Iఅసఱaఅ ఎబ్‌ఱఅవ 1857 a్‌ జూaస్త్రవ 105)

అవధ్‌లో పరిస్థితులు కొంతమేరకు మెరుగు పడ్డాక బేగం హజరత్‌ మహాల్‌ తన రాజకీయ కుశలతను చూపనారంభించారు. బ్రిటిషర్లతో మిలాఖత్‌ అయిన నేపాల్‌ పాలకుడు జంగ్‌ బహుద్దూర ్‌ను తనవైపుకు తిప్పుకునేందుకు పావులను కదిలించారు. ఆంగ్లేయు లకు వ్యతిరేకం గా స్వదేశీ పాలకులతో చేతులు కలిపినట్టయితే ఆయనకు కంపెనీ పాలకులు ఆశపెట్టిన దానికంటే, ఎక్కువ భూభాగాన్ని ఇవ్వగలనని వర్తమానం పంపారు. అవధ్‌ ఇరుగ ుపొరుగు స్వదేశీ పాలకులకు రానున్న గడ్డు పరిస్థితుల పట్ల హెచ్చరి కలు చేస్తూ, అవసరాన్ని బట్టి ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటూ, మంత్రాంగం నడుపుతూ బేగం హజరత్‌ మహాల్‌ కంపెనీ పాలకులకు చెమటలు పట్టించారు.

ఈ విధంగా బేగం తన పాలనాదక్షతతో స్వదేశీ పాలకుల మద్దతుతో అవధ్‌లో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్న దశలో ఢిల్లీలో తిరుగుబాటు విఫలమైంది. బహద్దూర్‌ షా జఫర్‌ను ఆంగ్లేయులు అరెస్టు చేశారు. తిరుగుబాటుకు కేంద్రంగా భావించిన ఢిల్లీ ఆంగ్లేయుల వశమైంది. ఈ వార్తలు తిన్నగా లక్నో చేరాయి. ఆ ప్రతికూల పరిస్థితులలో కూడా ఆమె ఆధైర్యపడలేదు. ప్రజల స్వదేశీ యెధుల అండదండలతో కంపెనీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు.

బేగం హజరత్‌ మహాల్‌ సుమారు 10 మాసాల పాటు ప్రత్యక్ష పాలన చేశారు. ఆంగ్లేయులు లక్నోలోని అలంబాగ్‌లోని రెసిడెన్నీ దాగి ఉండటం, ఆ రెసిడెన్సీ నుండి బయటపడి లక్నోను స్వాధీనం చేసుకోవడానికి కంపెనీ అధికారులు వేస్తున్న ఎత్తులను గమనించిన ఆమె రెసిడెన్సీ మీద దాడికి తన సైనికులను పురికొల్పారు. ఈ చర్య కోసం 1857 డిసెంబరు 22న సైనిక యోధుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ సమావేశంలో ఉత్తేజపూరితంగా ప్రసంగిస్తూ ‘ఎందుకీ నిరీక్షణ, శతృవుతో తలపడేందుకు భయపడుతున్నారా? బ్రిటిషర్లు తమ సైన్యాలను రప్పించేంత వరకు మీరు కూర్చోనే గడుపుతారా? ముందుకు సాగండి. మీరు పోరాడుతారా? లేదా? చెప్పండి పోరుబాటన నడుపలేమంటే నేను ఆంగ్లేయులతో మంతనాలు జరిపి నా ప్రాణాలను కాపాడుకుంటాను. ఏవిషయం చెప్పండి? అంటూ సైనికులను, సైన్యాధిపతులను నిగ్గదీశారు. ఈ సందర్భంగా సైనికు ల మీద తూటాల్లా ప్రయోగించిన ఆమె మాటలు తిరుగుబాటు యోధులలో ఆత్మబలిదానానికి సన్నద్ధులను చేసి, పోరుకు ప్రేరేపించాయి. (జుఅషవషశ్రీశీజూaసఱa శీట షశీఎవఅ దీఱశీస్త్రతీaజూష్ట్రవ ఙశీశ్రీశ్రీ జుస పవ చీaస్త్రవఅసతీa స.రఱఅస్త్రష్ట్ర ూూన జూబపశ్రీఱరష్ట్రఱఅస్త్ర షశీతీజూశీతీa్‌ఱశీఅ, చీవష ణవశ్రీష్ట్రఱ, 2001)

ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీ బేగం సేనలు చట్టుముట్టాయి. విజయమో వీర స్వర్గమో అంటూ పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాట సమయంలో బేగం అపూర్వ ధైర్య సాహసాలను ప్రదర్శిం చారు. బిడ్డడు బిర్జిష్‌ ఖదీర్‌ను వెంట పెట్టుకుని ఏనుగు మీద ఆమె స్వయంగా రణభూమికి విచ్చేశారు. (నaఓతీa్‌ ఎaష్ట్రaశ్రీ తీఱసఱఅస్త్ర శీఅ aఅ వశ్రీవజూష్ట్రaఅ్‌ వఅషశీబతీaస్త్రవస ష్ట్రవతీ aతీఎవ పవ ష్ట్రవతీ జూతీవరవఅషవ శీఅ ్‌ష్ట్రవ టఱవశ్రీస శీట పa్‌శ్రీవ, నఱర్‌శీతీవ శీట ఖీతీవవసశీఎ వీశీఙవఎవఅ్‌ ఱఅ Iఅసఱa. ణతీ ుaతీa జష్ట్రaఅస) మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను, ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపర్చారు. పోరాటం భయంక రంగా సాగింది. ఆ పోరాటం గురించి తెలుసుకున్న లక్నో కమిష నర్‌, బ్రిటిష్‌ అధికారి హెన్రీ లారెన్స్‌ వ్యాఖ్యానిస్తూ ఎక్కడా కూడా ఇంతకు మించిన శౌర్య ప్రతాపాలు మేము చూడలేదు. అంటూ బేగం నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రశంసించారు. ఈ పోరులో పలువురు కంపెనీ అదికారులు మృత్యువాత పడ్డారు. స్వదేశీ యోధులు ఎంతగా పోరాడినా రెసిడెన్సీ మాత్రం హజరత్‌ మహాల్‌ వశం కాలేదు.

ఇ సమయంలో బ్రిటిష్‌ అధికారుల నుండి సంధి ప్రస్తావన వచ్చింది. తిరుగుబాటుదారులకు క్షమాబిక్ష ప్రసాదిస్తామని, బేగంకు ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని, అందుకుగాను బేగం హజరత్‌ మహాల్‌ అవధ్‌ మీద తన అదికారాన్ని పూర్తిగా వదులుకోవాలని కంపెనీ అధికారులు ప్రతిపాదించారు.  ఆ ప్రస్తావ న పట్ల బేగం మండిపడ్డారు. మా గడ్డ మీద మరొకరి పెత్తనమా? మా ప్రాణాలు పోయినా సరే శత్రువుకు లొంగేది లేదన్నారు. బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ న్యాయమైన హ క్కులను, తన వెంట  నడిచిన స్వదేశీపాలకులను, సైనికుల ను, సేనాధిపతులను ప్రజల ను కంపెనీ బలగాల దయా దాక్షిణ్యాలకు వదిలి పెట్టలే నంటూ, ఆ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. నా ప్రా ణం మీద తీపితో న్యాయమైన హక్కులను వదులుకునేది లేద ని బేగం స్పష్టం చేశారు.