భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

యుద్ధ భయంతో సైన్యంలో చేర నిరాకరించిన పురుషుల చేతులకు స్వయంగా గాజులు తొడిగి, వారిలో రోషం రగిలించి తిరుగుబాటు సైనిక బలగాలను బాగా పెంచగలిగారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఆహారం, ఆయుధాలను సమకూర్చి పెట్టడం, నాయకులు, సైనికుల మధ్యన సంధానకర్తట్లా వ్యవహరించటం, బ్రిటీష్‌ సైనికుల కదలికలు గమనించి ఆ సమాచారాన్ని తిరుగు బాటు దళాల నాయకులకు చేరవేయటం తదితర బాధ్యతలను ఆమె నిర్వహించారు. దళ సభ్యులతో ఇల్లిల్లు తిరిగి బట్టలు, ఆహార పాదా ర్థాలను సేకరించి తిరుగుబాటు యోధుల అవసరాలను తీర్చుతూ వారికి ఎటువంటి లోటు కలుగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకు న్నారు. ప్రధానంగా రణరంగంలో గాయపడిన స్వదేశీ సైనికుల చికిత్సకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించటం పట్ల ఆమె శ్రద్ధను చూపారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులు గాయపడి అనాధలుగా ప్రాణాలు విడవటం పట్ల ఆమె శ్రద్ధను చూపారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులు గాయపడి అనాధలుగా ప్రాణాలు విడవటం పట్ల కలతచెందిన ఆమె క్షత గాత్రులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలందించారు.

అజీజున్‌ తరుచుగా తన మహిళా సైనిక బలగాలతో కన్పూరు పురవీధుల్లో కవాతు చేసి ప్రజలను ఉత్సాహపర్చేందుకు కృషి సల్పా రు. సంపూర్ణ సైనికాధికారి, దుస్తులతో, పలు సైనిక చిహ్నాలను అలంకరించుకుని, తుపాకి ఒకవైపు, ఖడ్గం మరోవైపున ధరించి కవాతులలో పాల్గొనటం ఆమెకు అలవాటు. ఆమె నేతృత్వంలో కవాతు సాగుతున్న బజార్లలో ప్రజలు బారులు తీరి నిలబడి ఆమె రాకకోసం ఎదురు చూస్తూ ‘నానాసాహెబ్‌ జిందాబాద్‌-బేగం అజీ జున్‌ జిందాబాద్‌’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలను చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసేవారు ఈ విషయం 1857 జూన్‌ 16న నానక్‌ చంద్‌ అను వ్యక్తి తన డైరీలో రాసిపెట్టిన సమాచారాన్ని బట్టి వెల్లడవుతుంది. ఆమె కృషి, నిస్వార్థ సేవాతత్పరత, కార్యదక్షత, ప్రగతిశీల ఆలోచనలను, నానా సాహెబ్‌ పట్ల చూపుతున్న విధేయు తను గమనించి నానాకు కుడి భుజంగా ఖ్యాతి చెందిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు, నానా సాహెబ్‌ ప్రధాన సహచరులు అజీముల్లా ఖాన్‌ ఆమె సేవలను ఎంతగానో ప్రశంసించారని ఆనాటి ప్రముఖ వ్యాపారి నానక్‌ చంద్‌ తన దస్తావేజులలలో రాసుకున్నా డు. (వఅషవషశ్రీశీజూaసఱa శీట ఎబరశ్రీఱఎ పఱశీస్త్రతీaజూష్ట్రవ, ఙశీశ్రీ.శ్రీ,వస. పవ అaస్త్రవఅసతీa సతీ. రఱఅస్త్రష్ట్ర, aజూష్ట్ర,జూaస్త్రవ.585)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అంతమైన తరువాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటులో పాల్గొన్న సంస్థానా ధీశులు, సైనికధికారులు, ప్రజల మీద భయంకరంగా విరుచుప డ్డారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి షశీశ్రీ.షఱశ్రీశ్రీఱaఎ తయారు చేసిన కాన్పూరు తిరుగుబాటుదారుల జాబితాలో అజీజున్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా కాన్పూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి జానకీ ప్రసాద్‌ సాక్ష్యం పలుకుతూ, ఆమె సదా సైనికాధికారి దుస్తులలో ఉంటూ, నానా సాహెబ్‌ కోసం ఆమె మహిళా దళాలు పనిచేశాయి. ఆమెకు పీష్వాసైనిక దళాలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. తిరుగుబాటు పతాకం ఎగరగానే ఆమె తిరుగుబాటు యోధులతో కలిసి పోరాబాటన నడిచారని, ఆంగ్లేయ న్యాయస్థానంలో విరించాడు. ఈ మేరకు ఆమె తిరుగుబాటు యోధుతో కలిసి పనిచేసిందని బ్రిటీషు అధికారుల విచారణలో పలువురు వ్యక్తులు సాక్ష్యం చెప్పారు. (వఅషవషశ్రీశీజూaవసఱa శీట ఎబరశ్రీఱఎ పఱశీస్త్రతీaజూష్ట్రవ, ఙశీశ్రీ.శ్రీ, జూaస్త్రవ.585

ఈ విచారణలో భాగంగా, బేగం అజీజున్‌కు కాధికారి స్త్రవఅవతీaశ్రీ ష్ట్రaఙవశ్రీశీషస ఎదుట హాజరు పార్చారు. ఆమె సాహసకృత్యాల గురించి విన్న ఆ అధికారి, ఆమె రూపురేఖలను చూసి ఆశ్ఛర్య పోయాడు. మగదుస్తుల నుండి ఆమె బయట పడగానే ఆమె అంద చందాలను చూసి అవాక్కయ్యాడు, ఆమె రణరంగంలో భయం కరంరగా వ్యవహరించడాన్ని సమ్మలేకపోయాడు. ఆమె కనుక ఆమెను క్షమాపణ వేడుకుంటే ఆరోణపలన్నీ రద్దుచేస్తానని, ఆమెను క్షమించి విడిచిపెట్టగలనని హామీ ఇచ్చాడు, ఆ ప్రతిపాదనలను బేగం అజీజున్‌ నిర్ధ్వంద్వంగా నిరాకరించారు. ప్రాణ భయం ఏమాత్రంలేని ఆమె ప్రవర్తన చూసి విస్తుపోయిన ఆ అధికారి, ‘నీకేం కావాలి? అని ప్రశ్నించాడు. నాకు ‘బ్రిటీష్‌ పాలన అంతం చూడాలనుంది’,  ( షaఅ్‌ ్‌శీ రవవ ్‌ష్ట్రవ వఅస శీట ్‌ష్ట్రవ పతీఱ్‌ఱరష్ట్ర తీబశ్రీవ,ఱపఱస జూaస్త్రవ. 586),  అని ఆమె నిర్భయంగా, చాలా ఘాటుగా సమాధానమిచ్చారు. అ సమాధానంతో ఆగ్రహిం చిన స్త్రవఅవతీaశ్రీ ష్ట్రaఙవశ్రీశీషస ఆమెను కాల్చివేయాల్సిందిగా సైనికులకు ఆదేశాలిచ్చాడు.

ఆ ఆదేశాలను విన్న అజీజున్‌ చిరునవ్వు చిందిస్తూ, తుపాకి గుండ్లకు ఎదురుగా నిలబడ్డారు. బ్రిటీష్‌ సైనికులు తుపాకులు ఒక్కసారిగా గర్జించాయి. ఆ తుపాకుల్లో నుండి గుళ్ళ బయల్పడి ఆమె సుకుమార శరీరాన్ని చేదింరుకుని దూసుపోతుండగానే నానా సాహెబ్‌ జిందాబాద్‌ అంటూ ఆ  అసమాన పోరాట యోధురాలు నినదించారు. ఆ సింహనాదంతో ఆంగ్లేయ సైనికులు ఒక్కక్షణం స్థంభించి పోయారు. మహాయోధ బేగం అజీజున్‌ ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి.

ఆ సహత్తర త్యాగమూర్తికి చరిత్రలో తగినంత స్థానం అభించలేదు. ఆ యోధురాలి గత జీవితాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా బ్రిటీషు చరిత్రకారులు, బ్రిటీషు సామ్రాజ్య వాదుల ఏజెంట్లు ఆమె గురించి అవాకులు చవాకులు రాశారు. నిజానికి ఆమె ప్రేమను బజారులో అమ్ముకొనలేదు. స్వతంత్ర సమ ర రంగంలో దేశభక్తికి కానుకగా అర్పించింది. (1857 స్వరాజ్య సంగ్రామం, సారర్కార్‌, పేజి 88) ఆ తరువాత జరిగిన పరిశో ధనలు బ్రిటీషర్లు కుట్రలను బయట పెడుతూ, అజీజున్‌ త్యాగమయ చరిత్రను వెలుగులోకి తెచ్చా యి. ఆనాటి అసత్యాలను, అ భూత కల్పనలను బట్టబ యలు చేశాయి. ఈ మేరకు సాగిన కృషి ఫలితంగా ఆ నాటి కుట్ర ల కారుమబ్బు లను చీల్చుకుం టూ మధ్యా హ్నం మార్తాండు డిలా ఆమె సాహసోపేత చరిత్ర వెలుగు లు చిమ్మడంతో బేగం అజీజు న్‌ ఉత్తమ చరిత్ర ప్రపం చనికి వెల్లడయ్యింది.