దొంగలు


” నాలుగు నెల్ల కింద రుద్రంగిలో ఏదో దొంగతనం జరిగిందట. ఇరువై అయిదు తులాల దాకా బంగారం పోయిందట. గా కేసులో మమ్మల్ని పట్టుకొచ్చిండ్రు. పట్టుకొచ్చి మూణ్ణెల్లయింది. గప్పటి నండి రోజు తంతున్నరు సారూ. గా దొంగతనంతో మా3కే సంబంధం లేదు. అయినా తన్నులు తిని తిని పెయ్యంతా తొక్కుతొక్కైంది” అంటే చెప్పుకుపోతున్నాడు. వాడి మొహం మీద, చేతుల మీద కమిలిపోయిన రక్తం మరకలు కన్పిస్తున్నాయి.

”వీళ్ళిద్దరేమన్నా చేసారా?” ప్రశ్నించాను.

”లేదు బాంచెను. వాళ్లేప్పుడూ దొంగతనం చెయ్యలేదు సారూ. అన్నాయంగా మమ్మల్ని పట్టుకొచ్చి రోజూ తంతుండ్రు వీడు మా అక్క కొడుకు, వాడేమో మా3 ఊరోడే” వాళ్ళని చూపిస్తూ అన్నాడు. వాడి గొంతు బొంగురుపోయింది.

”నీ వాళ్ళేవరూ రాలేదా….”

”పది దినాలకెళ్లి వస్తలేరు. అంతకుముందు రోజుకో పూట సద్ది తీసుకొచ్చే వారు. గిప్పుడు అది కూడా లేదు. వాళ్ళని మనిషికి తులం చొప్పున బంగారం తీసుకురమ్మని అమీన్‌ దొర జెప్పిండంట. గప్పటి నుంచి ఒక్కపూట తిండి లేక మలమల మాడుతున్నాం సారూ” అన్నాడు.

”మీ పేర్లేమిటి”

”నా పేరు శివరాత్రి రాజిగాడు, నా అల్లుని పేరు చింతకింది రాజయ్య, ఇంకోని పేరేమో నర్సిగాడు” చెప్పాడు. రాజయ్య వాళ్ళని చూపిస్తూ.

”మీ వాళ్ళొస్తే నా దగ్గరికి పంపు. ఏదన్నా సహాయం చేస్తాను” అన్నాను.

”అయ్యా!” అన్నాడు ఏదో కావాలన్నట్లు.

”ఏం సంగతి” అన్నాను.

”ఓ ఐదు రూపాయలుంటే ఇచ్చిపొండి సారూ. చాయ్‌, బీడి తాగక సానారోజులైంది బాంచెను. ఆ పోలీసు సారుని బతిమిలాడి తెప్పించుకుంటాం” దీనంగా అడిగాడు శివరాత్రి రాజయ్య. మిగతా ఇద్దరూ ఆశగా చూశారు నావైపు.

జేబులో నుంచి ఓ ఐదు రూపాయలు తీసి రాజయ్యకిచ్చాను. సంతోషంతో వాళ్ళ మొఖాలు వికసించాయి.

స్టేషన్‌కి వచ్చి అరగంట దాటుతోంది. ఎస్సై జాడలేదు. పక్కింటి అబ్బాయి కేసు గురించి సెంట్రీ దగ్గర వివరాలు తెల్సుకొని వెళ్దామని అక్కడి నుంచి కదిలాను.

సెంట్రీ స్టేషన్‌ ముందున్న వేపచెట్టు దగ్గరనిల్చుని ఎవరితోనో బాతాఖాని కొడుతున్నాడు. కకేసు వివరాలు చెప్పి ఆకుద్రాడి గురించి అడిగాను సెంట్రిని.

”రేపుదయం రమ్మని చెప్పి అతన్ని అప్పుడే పంపిచారు సార్‌” చెప్పాడు సెంట్రీ.

స్కూటర్‌ తీసుకొన బతుకమ్మ ఆడుకునే వాగువైపు పోయినాను.

సద్దుల కాడికి పోయిరాగానే ఆరుగురి ఇండ్లల్లో దొంగతనాలు జరిగాయన్న వార్త ఊరందరిని కలవరపరిచింది. ఆ వార్త ప్రజల మొఖాలకి మంచులా తాకింది. ఊరి ప్రజలందరూ సద్దులకాడికి పోయిన వెంటనే, అంటే ఐదారు గంటల ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. పోలీసులెవ్వరూ ఊళ్ళో లేకుండా, వాగు దగ్గరే ఎక్కువగా ఉండటం వల&్ల ఈ దొంగతనాలు జరగడానికి అవకాశం ఎర్పడిందని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే దొంగతనాలు జరిగాయని అందరూ అనుకొన్నారు.

తెల్లవారింది.

ఆ రోజటి అన్ని పత్రికలు నిన్నటి దొంగతనాలు గురించి ప్రముఖంగా ప్రచురించాయి. ఏఏ వీధుల్లో, ఎవరెవరి ఇళ్ళల్లో దొంగతనాలు జరిగాయో, ఎవరెవరు ఎంతెంత నష్టపొయ్యారో అన్నీ వివరంగా రాసాయి పత్రికలు. సాయంత్రం ఐదారు గంట ప్రాంతంలో జరిగిన ఆరు దొంగతనాలకి కారణం పోలీసుల అసమర్థత గురించిన చెడు అభిప్రాయం ప్రజల్లో మరింత బలపడింది.

మా పక్కింటి అబ్బాయి స్కూటర్‌ ఆక్సిడెంట్‌ జరిగి రెండు రోజులవుతుంది. వాళ్ళ నాన్న పోలీసువాళ్ళని కలిసి కేసు లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేసాడు కాని ఆది ఫలించలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఆ అబ్బాయిని స్టేషన్‌కి తీసుకువస్తే, కేసు బుక్‌ చేసి కోర్టుకి పంపిస్తామని చెప్పారని అందుకని నన్ను సాయంత్రం వరకూ కోర్టులో ఉండమని కోరాడు వాళ్ళ నాన్న.

మూడున్నర అవుతోంది. మేజిస్ట్రేట్‌గారు బేంచి మీదకు వచ్చినట్టున్నారు. చప్రాసి ఎవరో అడ్వకేట్లను పిలుస్తున్నాడు. కొంతమంది క్లయింట్లతో మాట్లాడుతూ వరండాలో నిల్చుని ఉన్నారు.

పక్కింటి అబ్బాయి నాన్న కోసం చూస్తూ బార్‌రూంలో కూర్చున్నాడు. కొద్ది సేపటికి వాళ్ళ నాన్న వచ్చాడు. తను ముందుగా కేసు వివరాలు తీసుకొని వచ్చానేశ్రీని, వాళ్ళబ్బాయిని తీసుకొని పోలీసులు వస్తారని కఎచెప్పాడు. ఇంత చిన్న కేసుకు వాళ్ళ నాన్న పడుతున్న ఆత్రుత చూస్తే జాలివేసింది. కేసు వివరాలు చదివి తెల్ల కాగితాలు తెప్పించి బెయిల్‌ దరఖాస్తు మెమో ఆఫ్‌ అప్పియరెన్స్‌ రాసుకొని కోర్టు హాల్లోకి వచ్చాను.

ఇద్దరు అడ్వకేట్లు వాదనలు చేస్తున్నారు. మేజిస్ట్రేట్‌ గారు ఆ వాదనలు వింటూ, అప్పుడప్పుడూ ఏవో కొన్ని పాయింట్లు నోట్‌ చేసుకుంటున్నాడు.

సాయంత్రం అవుతోంది.

కోర్టు ఆవరణలోకి ధన్‌ ధన్‌మని చప్పుడు చేస్తూ పోలీస్‌ జీపు దాని వెనకే పోలీసు వ్యాన్‌ వచ్చి ఆగాయి. బయట హడావిడిగా పోలీసులు బూట్ల టకటకలాడిస్తూ నడుస్తున్నారు. బహుళ ఇన్‌స్పెక్టర్‌ అయి ఉండవచ్చు. ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఏదో పెద్ద కేసులో నేరస్తుల్ని పట్టుకొచ్చినట్టుంది.

కొద్ది సేపటికి ఇన్‌స్పెక్టర్‌ లోపలికి వచ్చి నేల పగిలిపోయేట్టు బూటుకాలితో నేలను తన్ని మేజిస్ట్రేట్‌గార్కి సాల్యూట్‌ చేశాడు. ఆయన చేతిలో ఉన్న కాగితాలల కట్ట బెంచ్‌ క్లర్క్‌కి అందించి వచ్చి మాతో పాటు కూర్చున్నాడు.

ఏపిపిఓతో ఏదో మాట్లాడారు. ఏపిపిఓ ప్రక్కనే కూర్చున్న లాయర్‌ ”ఏమిటీ సంగతి” అని విచారించి, ఆ వార్త మా అందరి చెవినా వేశాడు. మొన్నటి బతుకమ&్మ నాడు జరిగిన దొంగతనాల కేసుల్లోని దొంగలని పట్టుకొచ్చారట. మా అడ్వకేట్లు కొందరు వెంటనే ఇన్‌స్పెక్టర్‌ గార్ని అభినందించారు.దొంగతనాలు ఎంత సంచలనం సృష్టించాయో దొంగల్ని అంత  త్వరగా పట్టుకొని, ఇంకా అంతకన్నా ఎక్కువే సంచలనం సృష్టించారని.

బయట గొలుసుల చప్పుడు వినిపించింది. గొల్లున ఏడుపులు కూడా వినిపించాయి. ఆ దొంగల్ని పట్టుకొచ్చి వరండాలో నిలబెట్టారేమో. బయట హడావుడి బాగా పెరిగింది. జనం దొంగల్ని చూడడానికి గుమిగూడారనుకొంటాన. పోలీసులు అందర్ని తిడుతూ తరిమేస్తున్న చప్పుడు.

”నోర్లు ముయ్యండిరా లంజకొడుకుల్లారా” ఏడుస్తున్న వాళ్ళని తిడుతున్నారెవరో.

”చేసేది చేసి ఇప్పుడెందుకు ఏడ్వడం” అన్నాడో అడ్వకేట్‌ ఇన్‌స్పెక్టర్‌తో.

”ఇట్లాగే ఉంటుంది సార్‌! దొరికితే దొంగ లంజకొడులు ఏడుస్తారు. దొరక్కపోతే దొరల్లాగా తిరుగుతారు. లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లంగా తయారవుతారు” అంటూ ఇంకా ఏఏమో చెప్పుకుపోతున్నాడు ఇన్‌స్పెక్టర:న.

అంతలోనే  మా పక్కింటి అబ్బాయిని కోర్టు హాల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. నేను రాసి ఉంచిన మెమో ఆఫ్‌ అప్పియరెన్స్‌ బెయిల్‌ పిటిషన్‌ ఫైఐల్‌ చేశాను. అది బెయిలబుల్‌ అఫెన్స్‌ కాబట్టి ఎలాంటి ఆర్గుమెంట్సు చెయ్యకముందే ఒక్క జమనత్‌తో బెయిల్‌ మంజూరు చేశారు.

తర్వాత మొన్నటి దొంగతనం కేసుల్లో పట్టుకొచ్చిన దొంగల్ని కోర్టులోకి తీసుకొచ్చారు పోలీసులు. న్యాయవాదులంతా వాళ్ళకేసి వింతగా చూస్తున్నారు. మేజిస్ట్రేట్‌గారు కూడా ఆసక్తిగా వాళ్ళవైపు చేశారు. ఫైలు చూసాక బయట నుండి చాలా మంది జనం కోర్టు హాల్లోకి తొంగి తొంగి చూస్తున్నారు.

కూతూహలాన్ని అణుచుకోలేక నేనూ వాళ్ళఖేసి చేసాను. వాళ్ళెవరో కాదు. వాళ్ళు మొన్న సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో, పోలీస్‌స్టేషన్‌ లాకప్పుల్లో ఉండి కాళ్లావేళ్ళా పడి నా దగ్గర అయిదు రూపాయలు తీసుకొన్ని శివరాత్రి రాజిగాడు, చింతకింది రాజయ్య, నర్సిగాడు.

అంతే. నేను, నేను కాదంటే ఎంత ఆశ్చర్యపోతానో అంతగా ఆశ్చర్యపోయాను.