భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

(గురువారం సంచిక తరువాయి)

ఆంగ్ల సైన్యాలను సాయుధంగా నిలువరించిన సాహసి

బేగం జమీలా (1835-1857)

మాతృభూమిని పరాయిపాలకుల నుంచి విముక్తం చేసి సొంతగడ్డను స్వదేశీయుల పాలనలో చూడాలన్న ప్రగాఢకాంక్ష కలిగిన యోధులు స్త్రీ-పురుష భేదం లేకుండా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ బాటను ఎన్నుకున్నారు. ఆ విధంగా తిరుగుబాటు యోధులతో కలిసి కదనరంగాన ఆంగ్లేయ సైనికులను నిలువరిం చిన యోధులలో ఒకరు బేగం జమీలా.ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో బేగం జమీలా 1935లో జన్మించారు. ఆమె ఆత్మాభిమానానికిమారుపేరైన పరాయి పాలకుల కు తలవంచని పఠాను కుటుంబానికి చెందిన యువతి. పరాయి పాలకుల పెత్తనాన్ని ఏమాత్రం సహించని వారసత్వంగల ఆమె ఆంగ్లేయుల అధికారాన్ని అంగీకరించలేదు. కంపెనీ పాలకులు మాతృభూమిని కబ్జా చేయడం భరించలేకపోయారు.ఆ సమయంలో 1857 నాటి ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ నగారా మోగింది. ఆ నగారాతో ఆమెలోని యోధురాలు రణరంగానికి సిద్ధమయ్యారు. మాతృ భూమి సేవలో ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ముందుకు సాగారు. స్వదేశీపాలకుల మీద దాడులు జరుపుతూ తరలివస్తున్న బ్రిటీషు సేనలను నిలువ రించడానికి తిరుగుబాటుయోధులతో కలిసి శత్రువుపై కలబడ్డారు.

ఆ సందర్భంగా ఆంగ్లేయ సైన్యాలు ఆమెను అరెస్టు చేశాయి. బ్రిటీష్‌ సైనిక న్యాయస్థానం విచారణ తంతును పూర్తిచేసి ఆమెకు ఉరిశిక్షను ప్రకటించింది. పుట్టినగడ్డను పరాయి పాలకుల నుంచి విముక్తం చేయటంలో ప్రాణాలను అర్పించి బేగం జమీలా చరితార్థులయ్యారు.

(Who is who Indian Martys, Dr.PN Chopra, Govt.of India Publications, New Delhi.1973, page no.64)

కదనరంగాన శత్రువును ఎదిరించిన యోధురాలు

బేగం ఉమ్‌ద్దా (1831-1857)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయ సైనికులతో పోరా డుతూ గాని, శత్రు సైనికులను నిలువరించడంలోగాని తిరుగుబాటు యోధులకు సహాయ సహకారాలు అందించడంలో గాని మహిళలు తమదైన పాత్ర నిర్వహించారు. ఆ కారణంగా మొత్తమ్మీది 255 మంది యువతులు ఉరికంబం ఎక్కారు. ఈ మేరకు Who is who Indian Martys (Dr.PN Chopra, Govt.of India Publications, New Delhi.1973  గ్రంథంలో పేర్కొన్న మహిళా యోధుల్లో అత్యధికులు ముస్లిం మహిళలు ఉండటం విశేషం. అటువంటి విశిష్ట స్థానం పొందిన మహిళల్లో బేగం ఉమ్‌ద్దా ఒకరు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫరాపూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో బేగం ఉమ్‌ద్దా 1831లో జన్మించారు. భయమంటే ఏమిటో ఎరుగని జాట్‌ కుటుంబానికి చెందిన యువతి ఆమె. ప్రాణాలను పణంగా పెట్టయినా స్వదేశీపాలనను సాధించుకోవాలన్న ఆత్మాభి మానంతో శత్రువుతో తలబడటంలో ఏమాత్రం వెనుకాడని వారసత్వం ఆమెది. పరాయి పాలకుల పెత్తనం ఆమెకు నచ్చలేదు. పరాయి పాలకులను పారద్రోలి స్వదేశీయుల పాలనను ప్రతిష్టించు కోవాలన్నది ఆమె కోరిక.

ఆ ఆకాంక్షను సాధించుకునే అవకాశం 1857లో లభించగానే పరాయి పాలకుల పెత్తనానికి చరమగీతం పాడాలనుకుంటున్న యోధుల సరసన బేగం ఉమ్‌ద్దా చేరారు. స్వదేశీ పాలకుల పక్షాన శతృసైనికులను నిలువరించేందుకు తిరుగుబాటు యోధులతో కలిసి బ్రిటీషు సైన్యాలను ఎదుర్కొన్నారు.ఆమె పోరుబాటన సాగుతు న్న సందర్భంగా ఆంగ్లేయ సైన్యాలు అరెస్టు చేశాయి. ఆంగ్లేయా ధికారులు సైనిక విచారణ జరిపి ఆమెకు ఉరిశిక్ష విధించారు. ఆమెతోపాటుగా మరో 11 మంది యువతులకు ఆ సందర్భంగా ఉరిశిక్ష అమలు చేశారు. ఆ పదకొండు మందితో పాటు బేగ్‌ ఉమ్‌ద్దా కూడా మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రాణాలను అర్పించారు.

అగ్నియుగంలో అపూర్వంగా భాసించిన సాహసి

ఖుదీరాంకి దీది

బ్రిటిష్‌ వలసపాలకుల బానిసత్వం నుంచి స్వదేశాన్ని విముక్తం చేసి, స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఉత్సాహంతో ఉరకలెత్తే యువతరం ఆయుధాలు చేపట్టి విస్ఫులింగాలై బ్రిటిషర్ల మీద విరుచుకుపడుతున్న అగ్నియుగం రోజులవి. విప్లవకారుల అణచి వేతకు పలు చట్టాలను అమల్లోకి తీసుకురావడమే కాకుండా, విప్ల వోద్యమాన్ని దుంపనాశనం చేయడానికి అన్ని రకాల అధికారాలను ప్రసాదించి పోలీసు అధికారులను ఆంగ్లేయ ప్రభుత్వం ఉసికొల్పింది. విప్లవకారులకు సహాయపడుతున్నారని ఏమాత్రం అనుమానం వచ్చినా, ఉద్యమ సానుభూతిపరులను అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించి అంతం చేస్తున్న భయానక వాతావరణమది. బ్రిటీష్‌ పోలీసుల దాష్టీకాలను భరించలేక కుటుం బ సభ్యులే విప్లవకారులైన తమ బిడ్డలతో సంబంధాలు వదులు కుంటున్న భయంకర వాతావరణంలో బ్రిటీష్‌ పోలీసులకు ఏమా త్రం భయపడకుండా విప్లవయోధుడు ఖుదీరాంకు అండగా నిలవ డమే కాకుండా ఆయనకు ఓ యువతి ఆశ్రయం కల్పించారు. ఆమె ను ఆయన దీదీ (అక్కయ్య) అని పిలిచారు. ఆ కారణంగా ఆమె ఖుదీరాంకి దీదీ అయ్యారు. ఆమె అసలు పేరు తెలియదు. చరిత్ర ఆమెను ఖుదీరాంకి దీదీ (ఖుదీరాం అక్కయ్య)గా నామకరణం చేసిం ది. ఆ పేరుతోనే ఆమె స్వాతంత్య్రోద్యమ చరిత్రలో గణతికెక్కారు. ఆమె ప్రముఖ విప్లవకారుడు మౌల్వీ అబ్దుల్‌ వహీద్‌ చెల్లెలు. అన్నకు తగ్గ చెల్లెలుగా ఆమె పోరుబాటన నడిచి పోరాట యోధులకు అండదండలు అందించారు.(Freedom Movement Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi. 1993. page no.34)

భయమెరుగని విప్లవకారుడు ఖుదీరాంను తమ్ముడిగా భావించిన ఆమె అతనికి ఆశ్రయమిచ్చారు. ఆంగ్లేయాధికారి కెన్నడి (Kennedy) భార్యను హత్య చేశారన్నది ఖుదీరాం మీద ఆరోపణ. బ్రిటీష్‌ మహిళను హత్యగావించాడని ఆగ్రహంతో రగిలిపోతున్న అధికారులు ఖుదీరాం సమాచారం కోసం, ప్రజలపై, విప్లవోద్యమ సానుభూతిపరులపై విరుచుకుపడి, విధ్వంసం సృష్టిస్తున్నారు. చిత్రహింసల పాల్జేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆమె ఖుదీరాంను రక్షించడానికి పూనుకోవడం సాహసం. ఆ విషయాన్ని పోలీసులు ఏమాత్రం పసిగట్టినా, ఖుదీరాంతో పాటుగా ఆమెకూడా దారుణ చిత్రహింసలకు గురికావడమే కాక ప్రాణాలను కూడా అర్పించాల్సి వచ్చేది. అటువంటి భయానక వాతావరణంలో కూడా ఆమె భయపడలేదు. అక్కయ్యకు ఏమాత్రం కష్టం-నష్టం కలిగిం చడం ఇష్టంలేక కొంతకాలం తరువాత ఖుదీరాం ఆమె వద్ద నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత అరెస్టయ్యారు. ఆయనను చాలాకాలం నిర్బంధంలో ఉంచింది ప్రభుత్వం. ఆ సమయంలో కూడా జైలులో ఉన్న ఖుదీరాం క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికి ఆమె ఎంతో తెగింపుతో ప్రయత్నించారని ఆ యోధురాలి సాహసాన్ని చరిత్రకారుడు ప్రముఖ రచయితSantimoy Ray, Ôáq ç>·+<¸Š+ Freedom Movement Indian Muslims(page no.34)లో ప్రశంసించాడు.

చివరకు ముజఫర్‌పూర్‌ జైలులో ఖుదీరాంను 1908 ఆగస్టులో ఉరితీశారు. ఉరిశిక్ష విధించిన విషయం తెలుసుకున్న ఆమె ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలను ఖాతరు చేయకుండా పోలసు వర్గాలను విమర్శించారు. అత్యంత కష్టకాలంలో విప్లవకారులకు అండగా నిలిచి, కోరి తెచ్చుకున్న కష్టనష్టాలను చిరునవ్వుతో భరించిన ఆ యోధురాలు భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఖుదీరాంకి దీదీగా చిరస్మరణీయమైన ఖ్యాతిని స్థిరపర్చుకున్నారు.

జుగాంతర్‌ విప్లవ దళం వీరవనిత

రజియా ఖాతూన్‌

భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రజానీకాన్ని అన్ని రకాల త్యాగాలకు సిద్ధపర్చింది. అహిం సామార్గంలో బ్రిటీష్‌ సేనల తుపాకీ గుం డ్లకు బలైన ఖుదాయే-ఏ- భిద్మ త్‌గార్‌లనూ (భగవ త్సేవకులు), ఆయు ధాలను చేతపట్టి బ్రిటీ ష్‌ పోలీసు-సైనిక ద ళాలను తొడగొట్టి సవాల్‌ చేసి రణ రంగంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను బలిపెట్టిన విప్లవకా రులనూ జాతీయోద్యమం సృజియించింది. బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తం కోరుతూ సాగిన ఈ పోరాటాల మార్గాలు ఏవైనా అందులో పురుషులతో పాటు మహిళలు కూడా నడుం బిగించి మున్ముందుకు సాగారు. విముక్తి పోరాటంలో ఏమాత్రం వెన్ను చూపక ఆయుధం చేపట్టి బ్రిటీషర్ల వెన్నులో చలి పుట్టించారు. ఈ మేరకు బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని సవాల్‌ చేసి హడలగొట్టిన ఆడపడు చులలో రజియా ఖాతూన్‌ ఒకరు. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర పుటలలో అగ్నియుగంగా పిలువబడిన సాయుధ పోరాట కాలంలో జుగాంతర్‌, అనుశీలన సమితి, ఆత్మోన్నతి దళం, గదర్‌ విప్లవ దళం, హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ తదితర విప్లవ దళాలలోని విప్లవవీరులు అపూర్వ ధైర్య సాహసాలతో, అసమాన త్యాగాలతో అగ్నియుగాన్ని రగిలించారు. అటువంటి విప్లవవీరుల సరసన నిలిచిన మహిళామణి రజియా ఖాతూన్‌. ఆమె ప్రముఖ విప్లవయోధుడు మౌల్వీ నశీరుద్దీన్‌ అహమ్మద్‌ కుమార్తె. చిన్ననాటి నుంచి ఆమెలో అంకురించిన దేశభక్తి భావనలు బ్రిటీష్‌ వ్యతిరేకతను తీవ్రతరం చేశాయి. స్వదేశాన్ని విదేశీ పాలకుల బానిసత్వం నుంచి విముక్తం చేయాలని ఆమె సంకల్పించారు. తండ్రితో పాటు ఆమె కూడా జుగాంతర్‌ విప్లవదళంలో సభ్యత్వం స్వీకరించారు. జుగాంతర్‌ విప్లవయోధులు సాగించిన సాయుధ పోరాటానికి దళ సభ్యురాలిగా రజియా ఖాతూన్‌ క్రీయా శీలక తోడ్పాటునందించారు.

మాతృదేశ విముక్తికోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి చిరునవ్వుతో బలిపెట్టడానికి సిద్ధమైన, ముక్సుద్దీన్‌ అహమ్మద్‌ (నెట్రకోన), మౌల్వీ గయాజుద్దీన్‌ అహమ్మద్‌, అబ్దుల్‌ ఖాదర్‌ (జమ్లాపూర్‌) తదితరులతో కలిసి రజియా ఖాతూన్‌ విప్లవ కార్యక్రమాలను నిర్వహించారు. బ్రిటీష్‌ పాలకవర్గాలు జుగాంతర్‌ దళ సభ్యులను పూర్తిగా మట్టుపెట్టాలని ఒకవైపున తీవ్రంగా కృషి చేస్తూ దాడులు, దాష్టీకాలకు పాల్పడుతున్న భయానక సమయంలో కూడా ఆమె మార్గం మళ్లకుండా విప్లవబాటన నడిచారు. ఆనాటి భయంకర పరిస్థితుల్లో కూడా విప్లవోద్యమంలో మున్ముందుకు సాగేందుకు రజియా ఖాతూన్‌ ఏమాత్రం భయపడలేదు. బ్రిటీష్‌ గూఢచారుల, పోలీసుల కదలికలను, ఇతర సమాచారాన్ని రహ స్యంగా విప్లవకారులకు చేరవేడటం, దళంలోని సభ్యులకు ఆశ్ర యం కల్పించటం, ఆహారం, ఆర్థిక, ఆయుధ సహాయ సహకారాలు అందజేయటంలాంటి పనులను చాకచాక్యంగా నిర్వహించి జుగాంతర్‌ విప్లవ దళం చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు.

ప్రముఖ చరిత్రకారుడు Santimoy Ray Ôáq ç>·+<¸Š+ Freedom Movement Indian Muslims, PPH, New Delhi. 1993, 44లో ఆ పోరాట యోధురాలు రజియా ఖాతూన్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

– సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

(తరువాయి భాగం రేపటి సంచికలో…