జులై 7 నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు

train
పోలవరం ముంపు బిల్లు
8న రైల్వే బడ్జెట్‌, 10 సాధారణ బడ్జెట్‌

న్యూఢిల్లీ, జూన్‌ 23 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావ ేశాలకు ముహూర్తం ఖరారైంది. నరేంద్రమోడీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను వచ్చే 10న ప్రవేశపెట్టనుంది. జులై 7 నుం చి ఆగస్టు 14 వరకు బడ్జె ట్‌ సమావేశాలు
జరగనున్నాయి. జూలై 8న రైల్వే బడ్జెట్‌, 10న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ వ్యవహరాల క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ సోమవారం సమావేశమై పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంది. 9వ తేదీన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. జూలై 8న రైల్వే మంత్రి సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. వచ్చే నెల 7 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహరాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించిందన్నారు. సోమవారం క్యాబినెట్‌ కమిటీ భేటీ అనంతరం పార్లమెంట్‌ హౌస్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని సీసీపీఏ ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్‌లను బిల్లు రూపంలో తీసుకురావాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌ అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌, పోలవరం ప్రాజెక్ట్‌ ఆర్డినెన్స్‌, ట్రాయ్‌ యాక్ట్‌ అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌, సెబీ వంటి పలు ఆర్డినెన్స్‌లను ప్రాధామ్యాలకు అనుగుణంగా బిల్లుల రూపంలో సభలో ప్రవేశపెట్టాలని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయా ఆర్డినెన్స్‌లోను జూలై మూడో వారంలో బిల్లుల రూపంలో రూపొందించనున్నట్లు సమాచారం. నెలకు పైగా సాగే ఈ సమావేశాల్లోనే ఆయా ఆర్డినెన్స్‌లకు సభ ఆమోదం లభించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. నెలకు పైగా సాగే బడ్జెట్‌ సమావేశాల్లో సభ 28 రోజులు సమావేశం కానుంది. గత పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు జూలై 31తో ముగియనుంది. దాని స్థానంలో కొత్త బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా రైలు చార్జీల పెంపైపు కత్తులు దూస్తున్నాయి. రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏకపక్షంగా రైలు చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అలాగే, నిత్యావసర వస్తువుల ధరలపై సర్కారును నిలదీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ సమావేశాల్లోనే ఉప సభాపతి ఎన్నిక నిర్వహించనున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటామని వెంకయ్యనాయుడు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత ¬దాపై నెలకొన్న సందిగ్ధానికి కూడా ఈ సమావేశాల్లోపే తెరపడనుంది. ప్రతిపక్ష ¬దాపై బడ్జెట్‌ సమావేశాల్లోపు నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. సభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న తమకే ప్రతిపక్ష ¬దా ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరుతోంది. ఎన్నికలకు ముందు భాగస్వామ్య పక్షాలతో పోటీ చేసిన తమకు అవసరమైన దాని కంటే ఎక్కువ మంది సభ్యుల బలం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ¬దా కల్పించాలని పట్టుబడుతోంది.