యూపీఏ, ఎన్డీఏలకు మేమే ప్రత్యామ్నాయం

11 పార్టీల కూటమిగా మూడోఫ్రంట్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
జాతీయ రాజకీయాలపై మరోమారు మూడో కూటమి చర్చ జరిపింది. కాంగ్రెస్‌ బీజేపీ యేతర పార్టీలన్ని ఢిల్లీలో సమావేశమయ్యా యి. 11 పార్టీలు కూటమిగా ఏర్పడి రానున్న లోకసభ ఎన్నికల్లో పోటీ- చేయడానికి నిర్ణయించాయని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ వెల్లడించారు. సమావేశా నంతరం ఆయన ఏచూరితో కలసి విూడియాతో మాట్లాడారు. దేశంలో యూపీఏ పాలన అవినీతి మయమైందని, కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్ల్రో పరిస్థితి మరింత దిగజారిందని కారత్‌ ఆరోపించారు. దేశమంతా కుంభకోణాల మయమైందన్నారు.ఇందుకు యూపిఎ కారణమన్నారు. కాంగ్రెస్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించలేకపోయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ విధానాల్లో తేడా ఏవిూ లేదని, ఈ రెండు కూటముల ఓటమే తమ ధ్యేయమని కారత్‌ వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపి పార్టీలను ఓడించడమే మూడో ప్రత్యామ్నాయ కూటమి లక్ష్యమని ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. కాంగ్రెస్‌, బిజెపి భాగస్వామ్యాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో తేడా లేదని చెప్పారు. యుపిఎ పాలన అవినీతిమయమైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బిజెపి సొమ్ముచేసుకోవాలని చూస్తోందని అన్నారు. వీటి ద్వంద్వ విధానాలను తిప్పికొడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బిజెపి యేతర పార్టీలు సమావేశమైనట్లు- వెల్లడించారు. 11 పార్టీలు కూటమిగా పోటీ- చేయాలని నిర్ణయించినట్లు- వివరించారు. యూపీఏ పాలనలో మహిళలకు భద్రత కరవైందన్నారు. భాజపా, కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాతే మూడో కూటమి ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకాశ్‌కారత్‌ చెప్పారు. కాంగ్రెస్‌, యూపీఏ కూటమి ఓటమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీజేడీ, ఏజీపీ, జేవీఎం గైర్హాజరయ్యాయి.