కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు?
మమ్మల్ని శాసించే అధికారం వారికెక్కడిది
అలాంటి దుస్సాహసం చేస్తే తిరుగుటపా
మేం స్వతంత్రం : రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 19 (జనంసాక్షి) :
కేంద్ర ఎన్నికల సంఘానికి తమను శాసించే అధికారం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంతో సమానంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తున్న ఆయన తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియ, నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకేనని అన్నారు. నిబంధనల మేరకే తాము ఎన్నికల విధులు నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికలు, ఫలితాలు వాయిదా వేయాలని ఈసీ కోరడం సరికాదన్నారు. మండల. జిల్లా పరిషత్‌ల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరిందని, గురువారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఇలాంటి తరుణంలో ఎన్నికల వాయిదా వేయాలని తమను కోరడం, ఆదేశించడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమన్నారు. అలాంటి ఉత్తర్వులను తిరుగుటపాలో పంపిస్తామని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగానే తమ సంస్థ కూడా స్వతంత్రమైనదేననే విషయాన్ని గుర్తించాలని అన్నారు.