బంగారు తెలంగాణ నిర్మిద్దాం


వంద అసెంబ్లీ, 15 ఎంపీలు మావే : పొన్నాల

హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) :

బంగారు తెలంగాణను నిర్మిద్దామని టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ప్రాంతంలో వంద అసెంబ్లీ, 15 లోక్‌సభ సీట్లు సాధించడమే తమ లక్ష్యమన్నారు. ఏప్రిల్‌ 30న తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ 100 అసెంబ్లీ స్థానాలు, 15 లోక్‌సభ స్థా నాలను గెలుచుకుంటుందని పొన్నాల తెలి పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరా డిన వారితో పొత్తుల కోసం మేం తలుపులు తెరిచి ఉంచింది నిజమే. అది మా బలహీనత కాదు. కేవలం బంగారు తెలంగాణ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసమే పొత్తు లకు తలుపులు తెరిచాం, అని గురువారం ఇక్కడ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల యూని యన్‌ ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్ర మంలో పొన్నాల వివరించారు. వస్తున్న వార్తల కు భిన్నంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతం లో గ్రామస్థాయి నుంచి పటిష్టంగా ఉందని ఆయన తెలిపారు. పార్టీని మేం మరింత పటిష్టపరుస్తాం. మా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల పొత్తు పెట్టుకోవడాన్ని వ్వతిరే కిస్తున్నారు. కానీ అలాంటి ఏదైన ప్రతిపాదన మా దగ్గరకు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం అని లక్ష్మయ్య వివరించారు. టిఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. వారిలో ఏ ఒక్కరి నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదన అందలేదు అని పొన్నాల తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంపైనే కాంగ్రెస్‌ ప్రధానంగా దృష్టి పెడుతుందని టిపిసిసి అధినేత నొక్కి చెప్పారు. ఆ ప్రాంతంలో అట్టడుగు వర్గాలు అత్యధికంగా ఉన్న కారణంగా సామాజిక తెలంగాణ సృష్టికి కూడా ప్రాధాన్యత ఇస్తానని పొన్నాల తెలిపారు. కొందరు తాము తెలంగాణాను పునర్‌నిర్మిస్తాం అని అదే పనిగి చెబుతున్నారు. అదేంటో   నాకు అర్థం కావడంలేదు. వారు కేవలం ప్రజలను మోసగించడానికే అలా అంటున్నారు. వారు అలాంటి నమ్మశక్యం కాని ప్రకటనలు చేయడం ద్వారా కేవలం రాజకీయ ప్రయోజనాలపైనే కన్నేస్తున్నారు అని టిపిసిసి అధినేత టిఆర్‌ఎస్‌ను పరోక్షంగా విమర్శించారు.