ఆది నుంచి అమేథి మాతోటే
మంచి ఇక్కడి ప్రజలకు తెలుసు : ప్రియాంక
అమేథి, మే 2 (జనంసాక్షి) :
అమేథి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆది నుంచి తమ కుటుంబంతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధిన ేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక అన్నారు. శుక్రవారం ఆమె అమేథిలో తన సోదరుడు రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమేథి నుంచి ఎంత మంది పోటీ చేస్తున్న ఇక్కడి ప్రజలు మంచినే కోరు కుంటారని తెలిపారు. తమ మంచిని కోరేది ఎవరో ప్రజలకు తెలుసని ఆమె
పేర్కొన్నారు. అమేథిని అభివృద్ధి చేసేది, చేయబోయేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కొన్ని పార్టీలు కేవలం రాజకీయం కోసమే పుట్టుకొచ్చాయని, ప్రజా శ్రేయస్సును మర్చిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీలను ఉద్దేశించి అన్నారు. కేంద్రంలో రాబోయేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. అత్యధిక మెజార్టీతో రాహుల్‌ను గెలిపించాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.