భూటాన్‌లో మోడీ పర్యటన విజయవంతం

five
విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌
థింపూ, జూన్‌ 16 (జనంసాక్షి) :
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి విదేశీ పర్యటన విజయవంతం అయిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. భూటాన్‌-భారత్‌ దేశాల మద్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయని సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నా రు. ప్రభుత్వాలు మారినా ఉభయ దేశాల సంబంధాల్లో ఎటువంటి మార్పు లుండవని ఆమె స్పష్టం చేశారు. సోమవారం విదేశాంగ శాఖ అధికారులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ భుటాన్‌ భారత్‌కు సన్ని హిత మిత్ర దేశమని వ్యాఖ్యానించారు. తమ
బృందానికి భూటాన్‌లో లభించిన గౌరవానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సాధారణ ప్రజల నుంచి రాజు వరకూ ఆదరించిన తీరు తమను ముగ్ధులను చేసిందని సష్మా హర్షం వ్యక్తం చేశారు. భూటాన్‌కు అందుతున్న జల విద్యుత్‌, పర్యాటకం వంటి రంగాల్లో భారతదేశం నుంచి సహాయ సహకారాలు కొనసాగుతాయని ఆమె వెల్లడించారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు భూటాన్‌కు సంయుక్తంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మోడీ ఆలోచిస్తున్నట్లు సుష్మా తెలిపారు. తమకు భూటాన్‌ అత్యంత ఆప్తదేశమని ఆమె అన్నారు.