ఎమ్మెల్సీలుగా నాయిని, నాయక్
న్యూఢిల్లీ, జూన్ 20 (జనంసాక్షి) :
తెలంగాణ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు తెరాస పొలి ట్ బ్యూరో సభ్యుడు రాములునాయ క్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. నాయిని ఇటీ వలే ¬ంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఎమ్మె ల్సీగా ఎన్నిక కావడం అనివార్య మయ్యింది. అలాగేఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ రాములునాయక్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ గట్టిగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని గవర్నరు కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వీరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ కేబినెట్ ఇదివరకే తీర్మానాన్ని ఆమోదించింది.