8నుంచి వికలాంగ క్రీడలు

ఖమ్మం,నవంబర్‌9(జ‌నంసాక్షి): ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల8, 9తేదీలలో వికలాంగులకు వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాయపుడి వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రీడాపోటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. నగరంలోని సర్థార్‌ పటేల్‌ స్టేడియంలో క్రీడాపోటీలు ఉంటాయని అన్నారు. 8వ తేదీన 17 సంవత్సరాల వయస్సులోపు వారికి, 9న 17 సంవత్సరాల పైబడిన వారికి పోటీలు జరుతాయన్నారు. 10 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలకు వ్యాసరచన, చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈపోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగతుందన్నారు. పురుషులకు ట్రై సైకిల్‌ రేస్‌, చెస్‌, క్యారమ్స్‌, రన్నింగ్‌, షాట్‌పుట్‌లలో స్త్రీలకు ట్రై సైకిల్‌, చెస్‌, క్యారమ్స్‌, రన్నింగ్‌లలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

9న కబడ్డీ ఎంపికలు

కబడ్డీ జూనియర్‌ బాలబాలికల ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సంయుక్త జట్టు ఎంపికలు ఈ నెల 9న ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఎంపిక చేయనున్నట్లు కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కృష్టఫర్‌బాబు తెలిపారు. 1-1-1997 తరువాత జన్మించిన బాలబాలికలు ఈ ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులని

పేర్కొన్నారు. బాలుర విభాగంలో 70 కేజీల లోపు, బాలికల విభాగంలో 65 కేజీల లోపు బరువు ఉన్న క్రీడాకారులకు అర్హతగా పరిగణించినట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 17 నుంచి కరీంనగర్‌ జిల్లాలో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పంపనున్నట్లు చెప్పారు.