స్ఫూర్తిదాయకంగా “దీక్ష దివాస్”

బి. వినోద్ కుమార్ మాజీ ఎం.పీ.
అంబేద్కర్ చౌక్ వద్ద స్థల పరిశీలన.
రాజన్న సిరిసిల్ల (జనంసాక్షి): నవంబర్ 29 దీక్ష దివాస్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బిఆర్ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. నవంబర్ 29న దీక్ష దివాస్ సందర్భంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు ఇష్టా రాజ్యాంగ మాట్లాడుతున్నారని అన్నారు. కొత్త తరానికి “దీక్ష దివస్”స్ఫూర్తిని అందించాలననే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదవులను తృణపాయంగా వదిలేసి ఆనాడు కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజీనామా చేసి తిరిగి గెలిచారని గుర్తు చేశారు. నవంబర్ 29 జరిగే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లాలోని అన్ని మండలాల నుండి బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. మీడియా సమావేశం అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద దీక్ష దివాస్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ అరుణ, బి.ఆర్.ఎస్. పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



