మాజీ మావోయిస్టు బిఆర్ఎస్ నేత సిద్ధన్నహత్య రాజన్నసిరిసిల్ల జిల్లాలో కలకలం.

ఇంటర్వ్యూ ప్రాణాల మీదకు తెచ్చిందా..?

జగిత్యాల పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.?

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 28, (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారు ప్రాంతంలోని అగ్రహారం గుట్టల్లో ఓ మాజీ మావోయిస్టు ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ నాయకులు హత్యకు గురికావడం జిల్లాలో కలకలం రేపుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చ పేట గ్రామానికి చెందిన బల్లెపు సిద్దయ్య అలియాస్ నరసయ్య 1997 ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీలో పని చేశారు.(మావోయిస్టు పార్టీలో విలీనం అయిన ఒక నాటి పీపుల్స్ వార్ పార్టీలు నాయకులు) సుమారు దశాబ్ద కాలం పాటు పనిచేసిన ఆయన అనంతరం జనజీవన స్రవంతిలో కలిసి గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్రపతి (బిఆర్ఎస్ )లో నాయకులు కొనసాగుతున్నారు. గురువారం ఆయన వేములవాడ శివారులోని అగ్రహారం హత్యకు గురయ్యారు.

_ ఇంటర్వ్యూ ప్రాణం తీసిందా..?

కొంత కాలం క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సిద్దన్న జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తిని ఆనాడు పార్టీ ఆదేశాల మేరకు హత్య చేసినట్లు తెలపడం ఆ విషయం లో జగిత్యాల జిల్లాకు చెందిన ఆనాడు హత్యకు గురైన వ్యక్తి కుమారుడు సిద్దయ్య హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. సిద్దయ్య తో సన్నిహిత్యం పెంచుకున్న సదరు యువకుడు తన యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ కావాలనే నెపంతో గురువారం సాయంకాలం అగ్రహారం సమీపంలోని గుట్టల వద్దకు పిలిపించి బండరాయితో హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. హత్య చేసినట్లు జగిత్యాల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. . సంఘటన స్థలాన్ని పరిశీలించిన వేములవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్ ఇంటర్వ్యూ సిద్దన్న ప్రాణాలు తీసిందా..? అనే అంశం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీ అంశం మారింది.