ఎన్నికల పనులలో మండల పరిషత్ సిబ్బంది

వేములవాడ రూరల్,(జనంసాక్షి):
గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణ కోసం అవసరమయ్యే ఏర్పాట్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా అవసరమైన పత్రాలు గ్రామపంచాయతీ వారీగా అందించే పనులలో బుధవారం కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఎన్నికల నియమాలు, అధికారులకు అందజేయాల్సి పత్రాలు, తదితర సామాగ్రి వార్డుల వారీగా సిద్ధం చేస్తున్నారు.