అమెరికన్‌ భారతీయుల కోసం హిందీ,సంస్కృత తరగతులు

వాషింగ్టన్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  అమెరికాలో నివాసముంటున్న భారతీయ ప్రజలకు శుభవార్త. ఇప్పటికే సిలికానాంధ్ర ఆధ్వర్యంలో తెలుగు తరగతులు ప్రారంభమయ్యాయి. తాజాగా హిందీ, సంస్కృత తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ తరగతులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపింది. హిందీ తరగతులు ప్రతి మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు జరుగును. ప్రతి గురువారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సంస్కృతం తరగతులు నిర్వహించనున్నారు.