ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం

హోం క్వారంటైన్‌కుముందు ఆస్పత్రిలో ఐదురోజులు
వైద్య సిబ్బంది కోరతతో ఇది సాధ్యం కాదన్న సిఎం కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నంసాక్షి): ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌కి తరలించే ముందు ఆస్పత్రిలోనే తప్పనిసరిగా అయిదు రోజు పాటు ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచాని ఢల్లీి లెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఉత్తర్వు జారీ చేశారు. అంతేకాకుండా ఇంటి వద్దే స్వీయ నిర్భంధంలో ఉన్నవారిపై తప్పనిసరిగా నిఘా ఉంచాని అధికారును ఆదేశించారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు భౌతిక దూరం పాటించకపోవడం వల్లే రాజధానిలో కేసు మరిన్ని పెరగడానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నా సమస్య తీవ్రమైతే వెంటనే హాస్పిటల్‌కి తరలించాని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ సహా ఇతర ఉన్నతాధికారుకు లేఖ రాశారు. అయితే కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుపై ఢల్లీి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే వైద్యు, నర్సు కొరత ఉందని ఇలాంటి పరిస్థితుల్లో అందరికి ఆస్పత్రిలో సేవందించడం సాధ్యమేనా అని సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుతానికి వేలాది మంది కరోనా రోగు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని, తాజా ఉత్తర్వు వ్ల పెద్ద సంఖ్యలో క్వారంటైన్‌ కేంద్రాు, పడకను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని దీని ద్వారా స్వతహాగా పరీక్షు చేయించుకోవానుకునే వారి సంఖ్య తగ్గుతుందని అన్నారు. ఫలితంగా కరోనా వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దేశ రాజధానిలో 8,400 కరోనా బాధితు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యు తీసుకుంటున్నా కరోనా కేసు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవలే ఢల్లీి ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కోవిడ్‌ నిర్దారణ అయిన సంగతి తెలిసిందే.