సాద బడ్జెట్‌

– ఆదాయ స్లాబు అంకెల గారడీ

– మాద్యానికి మందు కనిపించలేదు

పేద, మధ్యతరగతి, అన్నదాతల సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్‌

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్టాల్రకు ప్రోత్సాహకాలు

అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత

సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకం

సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు

సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌

గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం

పాలు, చేపల రవాణాకు కిసాన్‌ రైలు

కృషి ఉడాన్‌ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు

వ్యవసాయానికి 1.60 లక్షల కోట్లు

గ్రావిూణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు

మత్స్యకారులకు సాగర్‌మిత్ర పథకం

పీపీపీ పథకం కింద మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు

స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు

మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులు

వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు

విద్యారంగానికి రూ. 99,300 కోట్లు కేటాయింపు

ఇన్‌కమ్‌ టాక్స్‌ స్లాబుల్లో భారీ మార్పులు

త్వరలో నూతన విద్యావిధానం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి1(జనంసాక్షి) :ఈ దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఆమోదించి రెండోసారి కూడా భారీ మెజార్టీతో బీజేపీకి అధికారాన్ని అప్పగించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మోదీ నాయకత్వంలో ఈ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సారానికి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఇది సామాన్యుల బ్జడెట్‌ అని మధ్యతరగతి కలల బడ్జెట్‌ అని ఆమె వ్యాఖ్యానించారు. మనదేశ ఆర్థిక మూలాలు ఎంతో బలంగా ఉన్నాయని, ద్రవ్యల్బణం అదుపులో ఉందని ఆమె అన్నారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బ్జెట్‌గా ఆమె అభివర్ణించారు. నిర్మాణాత్మక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లున్నదని నిర్మలా సీతారామన్‌ స్షష్టం చేశారు. జాతి నిర్మాణంలో అన్నివర్గాలకు చెందిన యువత, మహిళల పాత్ర కీలకమని ఆమె అన్నారు. యువతను మరింత శక్తిమంతం చేసే దిశగా

ప్రభుత్వ నిర్ణయాలుంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెంచే విధంగా ఈ కేంద్రం బడ్జెట్‌ ఉంటుందని నిర్మల చెప్పారు. ఇకపోతే సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కేంద్రం తీపికబురు చెప్పింది. సాగు, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు 16 సూత్రాల కార్యాచరణ ప్రకటించింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన అందిస్తున్నామన్నారు. వ్యవసాయంలో పోటీతత్వం పెంచడమే తమ లక్ష్యమనీ.. వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలని ఆమె పేర్కొన్నారు. కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్టాల్రకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రావిూణాభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని, ఆ తరువాత ఆరోగ్యం, స్వచ్ఛత, విద్యలకు చోటు కల్పిస్తుందని ఆర్థిక మంత్రి తన బ్జడెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందుందని చెప్పారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా పథకాలు ప్రకటించారు. సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్‌ పంపులు ఇవ్వాలని నిర్ణయించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి..సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌ రానుంది. దేశంలో 160 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం పెంచనున్నారు. గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం స్వయ సహాయక బృందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం కల్పిస్తారు. ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్‌ సాయం తీసుకుంటారు. పాలు, చేపల రవాణాకు కిసాన్‌ రైలును భారతీయ రైల్వే పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్‌ రైలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కృషి ఉడాన్‌ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు అందుబాటులోకి తీసుకుని వస్తారు. ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరాయి. ఈ020-21లో అగ్రికల్చర్‌ ర్గీ/నాన్స్‌ లక్ష్యం రూ.15 లక్షల కోట్లు. ప్రస్తుతమున్న 58 లక్షల స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తాం అన్నారు. వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు ఉంటుందన్నారు. గ్రావిూణాభివృద్ధి, పంచాయితీ రాజ్‌ కోసం 1.23 లక్షల కోట్లు కేటాయింపు ప్రకటించారు. తత్స్యకారుల కోసం సాగర్‌మిత్ర పథకం ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ ‘అన్నదాతా సుఖీభవ’ అన్నట్లు సాగింది. రైతులకు అన్ని రూపాల్లో మేలు జరిగేలే ప్రభుత్వం పలు నిర్ణయాలు ప్రకటించింది. గ్రావిూణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా నిర్ణయించడం వల్ల రైతులకు మేలు జరగనుంది. అలాగే, రైతులకు 20 లక్షల సోలార్‌ పంపు సెట్ల పంపిణీ, బీడు భూముల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, భూసార పరిరక్షణకు సాయం, రసాయన ఎరువుల నుంచి విముక్తి కలిగించడం, గిడ్డంగుల

నిర్మాణానికి నాబార్డు, పీపీపీ పద్దతిలో సాయం అందించడం వల్ల కూడా రైతులు ప్రయోజనం పొందుతారు. ధాన్యం కొనుగోలుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌ జీలకు సాయం చేయాలని నిర్ణయించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాలని, వర్షాభావ జిల్లాలకు సాగునీటి సదుపాయం కల్పనకు అదనపు నిధుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. 3400 సాగర మిత్రల ఏర్పాటు, కూరగాయల సరఫరాకు ‘కృషి ఉడాన్‌ యోజన’ ప్రారంభిం చనున్నారు. కోస్తా ప్రాంతాల్లోని గ్రావిూణ యువతకు మత్స్య పరిశ్రమాభివృద్ధి పై మరింత సాయం చేయనున్నట్లు మం త్రి ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా అదుపు చేయగలిగామని ఆమె అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ ఆకాంక్షలు, ఆర్థిక ప్రగతి, ప్రజల సంరక్షణ అనే మూడు అంశాల విూదే తన బ్జడెట్‌ రూపొందిందని ఆమె అన్నారు. డీమ్డ్‌ యూనివర్సిటీ ¬దాతో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఏర్పాటు.

స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు,వైద్యరంగానికి రూ.69,000 కోట్లు,జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు ప్రకటించారు. టైర్‌-2, టైర్‌-3 పట్టణాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన. జన్‌ ఔషధి కేంద్రాలను మరింత విస్తరిస్తాం. 150 ఉన్నత విద్యా సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ ప్రారంభం. అప్పుడే ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసుకొని వచ్చిన విద్యార్థులకు పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయించారు. నైపుణ్యాల మెరుగుదలకు రూ.3,000 కోట్లు కేటాయింపు. నేషనల్‌ పోలీస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. టీచర్లు, పారామెడికోల సంఖ్యను పెంచుతాం. జిల్లా ఆసుపత్రుల్లో వైద్యకళాశాలల ఏర్పాటు.జిల్లా ఆసుపత్రులతో మెడికల్‌ కాలేజీల అనుసంధానం.భారత్‌లో చదువుకునేందుకు ‘ఇండ్‌సాట్‌’ కార్యక్రమం.

మ్యూజియాలుగా పురావస్తు స్థలాల అభివృద్ది

అయిదు పురావస్తు స్థలాలను మ్యూజియాలను మారుస్తున్నట్లు ప్రకటించారు. హర్యానాలోని రాఖీగఢీ, యూపీలోని హస్తినాపూర్‌, అస్సాంలోని శివ్‌ సాగర్‌, గుజరాత్‌లోని దోలావీరా, తమిళ్‌నాడులోని ఆదిచనెల్లూరులను మ్యూజియాలుగా మారుస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్‌ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్‌ కోసం రూ.38,757 కోట్లు కేటాయించారు.

ధరలు పెరిగేవి

ఫర్నీచర్‌

చెప్పులు

సిగరెట్లు

పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు

కిచెన్‌లో వాడే వస్తువులు

క్లే ఐరన్‌

స్టీలు

కాపర్‌

సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌

కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు

స్కిమ్డ్‌ మిల్క్‌

వాల్‌ ఫ్యాన్స్‌

టేబుల్‌వేర్‌

ధరలు తగ్గేవి

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌

ఎలక్ట్రిక్‌ వాహనాలు

మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు

ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు

 

బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం

ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకంతో తెలంగాణ రైతులకు సహాయం చేస్తోందని తాజా ఆర్థిక సర్వే తెలిపిందని, కానీ బడ్జెట్‌లో ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, విభజన హావిూలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని అన్నారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టైన కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించలేదని, ఇండస్ట్రీయల్‌ కారిడర్‌ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.తెలంగాణకు ట్రైబల్‌ మ్యూజియం కేటాయించాలని కోరామన్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లె విధంగా బడ్జెట్‌ లేదని అభిప్రాయపడ్డారు. గతంలో 18 శాతం వృద్ధి రేటు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కేంద్ర విధానాల వల్ల వృద్ధి రేటు 9శాతానికి పడిపోయిందని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో ఉందని అన్నారు. మెదక్‌ ఎంపీ, కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో తాము కోరిన 22 అంశాలకు కేటాయింపులు ఉంటాయని అనుకున్నామన్నారు. బడ్జెట్‌లో హర్‌ ఘర్‌ జల్‌ అన్నారని, తెలంగాణ రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ముందే అమలు చేశారని తెలిపారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రైతుల కోసం పనిచేస్తున్నామనడం చోద్యంగా ఉందని అన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్టుల అంశాలు మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ నదీ ప్రాజెక్టులు, నీటి నిల్వలపై చేపల పెంపకం చేపట్టామని..ఆ ?కార్యక్రమం మంచిగా కొనసాగుతోందని అన్నారు. సాగర మిత్ర అనేది కేసీఆర్‌ ఎప్పుడో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని, పర్యాటక రంగానికి సంబంధించి నిధులు కేటాయించలేదని అన్నారు. విభజన హావిూల ప్రస్తావనే లేదని, పాత సీసాలో కొత్త సారా పోసినట్టు బడ్జెట్‌ ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌ అంకెల గారడిగా ఉందని, రైతులను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో జీఎస్టీ బకాయిల అంశం లేదని ,తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ ¬దా ఇవ్వాలని కోరామని, విభజన హావిూల ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పోరాడాలని కోరారు.చెవెళ్ల ఎంపీ, రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికే తెలంగాణ సంపద సృష్టిస్తోందని కేంద్రం చెప్పిందని, అన్ని రంగాల వారిగా వృద్ధి రేటులో తెలంగాణ ముందుందని అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక మందగమనం నుంచి ఏ విధంగా బయట పడాలో ఆలోచన చేయడం లేదని, పక్క దేశాలు అవలంభిస్తున్న విధానాలు అవలంభించాలని తెలిపారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూని సాధించాలంటే చాలా డబ్బులు కావాలని, కేంద్రం లెక్కల గారడి చేస్తోందని విమర్శించారు. పథకాల అమలులో తెలంగాణ ముందుందని తెలిపారు. అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా సాధ్యమని, బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని రంజిత్‌ రెడ్డి అన్నారు.

ఉద్యోగాల కల్పనను విస్మరించారు

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం నిర్మూలనకు బడ్జెట్‌లో ఎలాంటి వ్యూహాత్మక ఆలోచనలను చేయలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. యువత ఉద్యోగ అవకాశాలు పెంచేందకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పకపోవడం బాధాకరమని ఆయన చెప్పారు. లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం ముగిసిన తర్వాత రాహుల్‌ గాంధీ బడ్జెట్‌పై స్పందించారు. సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగంతో దేశానికి ఒరిగిందేవిూలేదని రాహుల్‌ పేర్కొన్నారు.

భారత్‌ ఆర్థిక బలోపేతానికి బడ్జెట్‌ ఊతం

– నైపుణ్యాలపై దృష్టి సారించామన్న ప్రధాని

– నిర్మలా బృందాన్ని అభినందించిన మోడీ

నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ పెట్టుబడులు, ఆదాయం, డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజల అవసరాలను, దశాబ్దపు ఆర్థిక అంచనాలను పరిపూర్ణం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ద్వారా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని.. ఈ దశాబ్దపు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆమె బృందానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, జౌళి పరిశ్రమ, సాంకేతిక రంగాల్లో ఉపాధి కల్పనకు దోహదపడుతుందన్నారు. ఆదాయాన్ని పెంచేందుకు 16 కీలక అంశాలపై దృష్టి సారించామని, గ్రావిూణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి మోదీ మాట్లాడుతూ… దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్‌లో ప్రోత్సహకాలు కల్పించామన్నారు. యువతకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ విధానాలు విదేశాలకు వెళ్లే వారి కోసం బ్రిడ్జ్‌ కోర్సులు ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్త్రృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్‌ భారత్‌ కొత్త దశను నిర్దేశిస్తురదని వెల్లడించారు. దేశంలో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.బడ్జెట్‌లో స్మార్ట్‌సిటీలు, డేటా సెంటర్‌ పార్కులు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇక కొత్తగా 100 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయడం, రవాణా రంగంలో మౌలిక వసతుల కల్పన ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగ కల్పన పెరుగుతుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిరాశజనంగా కేంద్ర బడ్జెట్‌ : సీఎం కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్‌ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో సీనియర్‌ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్‌ పై ఈ క్రింది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయింది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి కానీ, 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడింది.2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది. ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రెండు.. తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్ల రూపాయలు తగ్గనున్నాయి. ఇంత భారీగా తెలంగాణకు నిధులు తగ్గించడం ఖచ్చితంగా వివక్షే. ఈ తగ్గుదల ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తున్నది. ఈ సారి కూడా అంచనాలు సవరించే నాటికి చెప్పిన దాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతున్నది. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది.జిఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తున్నది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుంది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్‌ వచ్చే సరికి గత ఏడాదికన్నా 148 కోట్ల రూపాయలు తగ్గించి, కేవలం 889 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణాభివృద్దికి ఇచ్చే నిధుల్లో 14.3 శాతం కోత పెట్టారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రానికి అందివ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించాం. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు.తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదు.

అన్ని ప్రధాన రంగాలకు కోతలు

రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు.”కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హావిూని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రావిూణాభివృద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది” అని ముఖ్యమంత్రి అన్నారు.వ్యవసాయరంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి గత ఏడాది 2.24 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 2.13 శాతం నిధులు మాత్రమే కేటాయించారు.గ్రావిూణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. సవిూక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.