అనాధ శవానికి దహన సంస్కారాలు చేసిన సర్పంచులు

share on facebook

మద్దూరు (జనంసాక్షి) జూన్ 25 : మండల పరిధిలోని వల్లంపట్ల గ్రామ శివారులో తరిగొప్పుల మండలం సొలిపుర్ గ్రామానికి చెందిన అనాధ వంగా రాఘవరెడ్డి (65) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ సందర్బంగా కో ఆపరేటివ్ సొసైటీ జిల్లా డైరెక్టర్ ఆలేటి యాదగిరి మాట్లాడుతూ.. రాఘవరెడ్డి కి తోడపుట్టిన వాల్లు  బందువులు ఎవరు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ అడుక్కొని అన్నం తింటూ గుడి వద్ద పాఠశాల విద్య ఉండేవాడని గత 15 రోజులుగా గ్రామంలో కనబడలేదని అలాగే సొంత గ్రామానికి కూడా వెళ్లలేదని ఈరోజు ఉదయం పశువుల కాపరులకు మృతదేహం కనబడటంతో మాకు సమాచారం అందించడంతో మేము ఎస్ఐ నారాయణ కి సమాచారం అందించగా వారు తమ సిబ్బందితో ఘటన స్థలానికి వచ్చి మృతదేహానికి పంచనామా నిర్వహించి అనంతరం వైద్య అధికారిని పిలిపించి పోస్టుమార్టం చేయించారు. వల్లంపట్ల గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత యాదగిరి, సోలిపుర్ గ్రామ సర్పంచ్ ఎర్ర సిద్ధులు కలిసి అనాధ శవానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అశోక్, గ్రామ కార్యదర్శి మహేందర్,పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.