ప్రైవేట్‌ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలి

 

 

 

 

 

 

డిసెంబర్ 30 (జనం సాక్షి)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్‌ 181లోని భూదాన్‌ భూమిని అక్రమంగా బదిలీ చేశారంటూ ఐఏఎస్‌ అధికారి నవీన్‌మిట్టల్‌పై దాఖలైన ప్రైవేట్‌ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కే సుజన సోమవారం విచారణ జరిపారు. గతంలో మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు.