” అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు అక్రిడేషన్ అందుతుంది – టీయూడబ్ల్యూజేహెచ్ – 143″

share on facebook
శేరిలింగంప‌ల్లి, జూన్ 25( జనంసాక్షి): పాత్రికేయ రంగంలో కొనసాగుతూ జర్నలిస్టుల పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్ కు మీడియా అక్రిడేషన్ కార్డు అంది తీరుతుందని టీయూడబ్ల్యూజే హెచ్ -143 రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్, డి పి ఆర్ ఓ, అక్రిడేషన్ కమిటీ సభ్యులతో కలిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ -143 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శేఖర్ సాగర్, గ్యాదం రమేష్, tsuwj  రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలు మాట్లాడుతూ  సామాజిక చైతన్యం, సమసమాజ స్థాపనలో పాత్రికేయులది క్రియాశీల పాత్ర, కీలక భూమిక ఉంటుందని అన్నారు. రిపోర్టర్ గా, పాత్రికేయుడుగా, జర్నలిస్టుగా మీడియా రంగంలో కొనసాగుతున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్ కార్డ్ అంది తీరుతుందని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ సహకారంతో ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులను అందిస్తామని హామీ ఇచ్చారు. విధినిర్వహణలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, సమాజ ఉద్ధరణ కు ప్రతినిత్యం పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలను టీయూడబ్ల్యూజే హెచ్ ఎప్పటికప్పుడు పాత్రికేయులకు అందించేలా ప్రత్యేక చొరవ చూపించడం జరుగుతుందన్నారు. విధినిర్వహణలో అలుపెరగని పోరాటం చేస్తున్న రిపోర్టర్ కి కుటుంబ భద్రతకూడా ఒక బాధ్యత నేనని, అందుకే ప్రతి విలేఖరి ఆరోగ్యంతోపాటు ఇతర సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు భుజంగా రెడ్డి, నమస్తే తెలంగాణ జిల్లా స్టాపర్ రాఘవేందర్, స్మాల్ మీడియం పేపర్ ప్రతినిధి సయ్యద్ జాఫర్ హుస్సేన్, ఫోటోగ్రాఫర్ విష్ణు కుమార్, డిపిఆర్ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.