ఉపాధి కూలీలకు ఎండల దెబ్బ

share on facebook

పనిప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వైనం
జాబ్‌కార్డున్న వారిలో 60శాతం మాత్రమే హాజరు
పెద్దపల్లి,మే18(జ‌నంసాక్షి): ప్రస్తుతం వేసవి ఎండలు మండుతుండగా,దీనికి తోడు వడగాల్పులు ఉధృతమయ్యాయి. ఉదయం రెండు మూడు గంటలు మినహా మిగితా సమయమంతా ఉష్ణోగ్రతలు విజృంభిస్తుండటంతో పని ప్రదేశాల్లో ఉపాది కూలీలు పని చేయడం ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది పిబ్రవరి చివరి వారం నుంచి ఎండల తీవ్రత అధికం కావటంతో మార్చి నుంచి ఉపాధీ కూలీలు ఉదయం 7గంటల నుండి 10 గంటల మద్యే ఉపాధి పనులకు వెళ్తున్నారు. కొంచెం ఆలస్యం అయిన కూలీలు ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. ప్రభుత్వం కూలీల కోసం రక్షణాత్మక చర్యలు తీసుకున్న వాటి ఆచరణ ఎక్కడ కనబడటం లేదు. ముఖ్యంగా నీడ సౌకర్యం, త్రాగునీటి వసతి ఏర్పాట్లలో పూర్తిగా అధ్వాన్నంగా మారినట్లు కూలీలు చెబుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు షెడ్‌నెట్‌ ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసినప్పటికి వాటి ఏర్పాటు ఎక్కడ కూడ లేవు. ఇక తాగునీటి కోసం అధికారులు కూలీలకు రూ.5 చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా కూలీలు నిర్లక్ష్యంగా చాలి
చాలని బాటిళ్లతో నీటిని తీసుకొని పోయి డ్రీహైడ్రేషన్‌ బారిన పడుతున్నారు. ఇక డ్రీహైడ్రేషన్‌ బారిన పడిన వారికి ప్రథమ చికిత్స అందించే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. పని జరుగుతున్న ప్రాంతాల్లో ఫిల్డ్‌ అసిస్టెంట్‌లు కూలీలకు ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాల్సి ఉండగా ఎక్కడ కూడ వాటిని అందించడం లేదని కూలీలు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.
వంద రోజుల పని దినాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హావిూ పథకం అమలు చేస్తుంది. కూలీలకు క్యూబిక్‌ విూటర్ల లెక్కన కూలీ చెల్లిస్తున్న గ్రావిూణాభివృద్ది శాఖ పని ప్రదేశాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం లేదు. మరో వైపు త్రాగునీటి ఏర్పాటు కూడ అధికారుల పట్టించుకోకుండా కూలీల కే రూ.5 అలవెన్సు ఇచ్చి చేతుల దులుపుకుంటున్నారు.  జాబ్‌కార్డులు పొందిన వారిలో 35 నుండి 45శాతానికి మించి ఎవరు పనులకు రాని పరిస్థితి కొనసాగుతుంది.

Other News

Comments are closed.