ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవం

share on facebook
వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకం ఊరేగింపు
నిర్వహించిన పూర్వ ఏబీవీపీ నాయకులు
ఎల్లారెడ్డి  11 ఆగస్ట్. (  జనం సాక్షి ), 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ పూర్వ విద్యార్థులు ఘనంగా ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్వ ఏబీవీపీ నాయకులు జక్కుల సంతోష్ మాట్లాడుతూ, భారతదేశం గర్వించదగ్గ దేశం, దేశంలో ఎన్నడూ చేయని విధంగా 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం, పల్లె పల్లెనా ప్రతి ఇంటిపై పతాకావిష్కరణ కార్యక్రమం, దేశం మొత్తం సంబరాలు నిర్వహిస్తున్నరాని,అన్నారు.  ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో ఏబీవీపీ పూర్వ విద్యార్థులు  వెయ్యి అడుగుల జాతీయ పతాకం మున్సిపల్ పట్టణంలో ప్రధాన రహదారిపై స్వాతంత్ర దినోత్సవం వేడుకలను, త్రివర్ణ పతాకం జెండాతో ప్రధాన రహదారి పై ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, ఏబీవీపీ నాయకులు, తులసి సృజన్ గౌడ్ సాయిబాబా. ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.