కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన కేజీవీబీ విద్యార్థులు

share on facebook

అలంపూర్ ఆగష్టు 12 జనంసాక్షి అలంపూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు కేసిఆర్ చిత్రపటానికి అలంపూర్ కేజీవీబీ విద్యార్థులతో శుక్రవారం అలంపూర్ శాసనసభ్యులు వి.ఎం అబ్రహం రాఖీ కట్టించారు.అనంతరం విద్యార్థులకు బట్టల పంపిణీ చేశారు. స్కూల్ ను సందర్శించి భోజనం పరిశీలించి, విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాత్రమే అన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తుందని తెలియజేశారు.అనతరం రాఖీ పౌర్ణమి శుభాకంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.