నిజామాబాద్‌లో విషాదం

share on facebook

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి
నిజామాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి ప్రాణాలు
కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజాహిద్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ రియాజ్‌ (10), మహ్మద్‌ బద్రుద్దీన్‌(5) అనే ఇద్దరు చిన్నారులు మంగళవారం మధ్యాహ్నం ఆటాడుకుంటామని చెప్పి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రం అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి సమయంలో మృతుల ఇళ్లకు సవిూపంలో కారు వెనకసీటులో పిల్లలు విగత జీవులుగా కనిపించారు. కారు ఓనర్‌ అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో కారు డోర్‌ తీయగా పిల్లలు చనిపోయి ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతి చెందిన పిల్లలిద్దరూ అక్కాచెళ్లిళ్ల కుమారులు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు డోరు తసీఇ ఉండడంతో అందులోకి వెళ్లి డోర్‌ వేసుకోగా ఇలా జరిగి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Other News

Comments are closed.