కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి చెందిన రాథోడ్ రేణుక (26) పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది తండాకి చేరుకుని, తక్షణనమే రేణుక ని హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో అంబులెన్సు లో సుఖ ప్రసవం చేశారు. మూడవ కాన్పు కావడంతో పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో నిర్విరామంగా ప్రజలకు సేవలందిస్తూ అంబులెన్సు లో సుఖ ప్రసవం చేసిన 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి శంకర్, పైలట్ రామశంకర్ కు, రేణుక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Other News
- శీతాకాలం కాబట్టే పెట్రోల్ ధరలు పెరిగాయి
- బండారు దత్తాత్రేయకు అవమానం
- .వామన్ రావు హత్యపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
- ఉద్యాన'సాగు విస్తరించాలి
- 8విడతల ఎన్నికలా..?
- ఆంధ్రభూమి లాకౌట్పై ఉద్యమిస్తాం - టీయూడబ్ల్యూజే
- భారత్ బంద్ విజయవంతం
- ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
- .ధరణి పనితీరుకు సాక్ష్యం
- గుజరాత్లో నవశకం - కేజ్రీవాల్