విక్రమ్‌ సినిమాకు మహాన్‌ పేరు ఖరారు

share on facebook


తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన 60వ సినిమాగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో విక్రమ్‌ తో పాటు ఆయన తనయుడు ధృవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా సమయంలోను అన్ని జాగ్రత్తలు తీసుకొని మూవీ షూటింగ్‌ పూర్తి చేశారు.
ఈ యాక్షన్‌ డ్రామాలో ధృవ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని, విక్రమ్‌ మూడు విభిన్న గెటప్స్‌ లో కన్పించనున్నాడని ఇంతక ముందు వార్తలు వచ్చాయి. తాజాగా చిత్రం నుండి చియాన్‌ లుక్‌ విడుదలైంది. ’మహాన్‌’అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేయగా, ఇందులో విక్రమ్‌ పొడవాటి జుట్టు, గడ్డంతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. బుª`లలెట్‌పై కూర్చున్న విక్రమ్‌ వెనకాలు కొమ్ములు, 16చేతులు గల ఒక ఆకారం కూర్చొని ఉంది. ఈ పోస్టర్‌ అభిమానులకి సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్‌, వాణి భోజన్‌ , బాబీ సింహా తదితరులు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు.

Other News

Comments are closed.