శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

share on facebook

రంగారెడ్డి,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్‌ఐ అధికారులు విూడియాకు తెలిపారు. పట్టుబడిన ఈ బంగారం విలువ రూ.1.85 కోట్లు ఉంటుందని వారు చెప్పారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి 4.9 కిలోల విలువైన 42 బంగార బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని, సదరు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి శంషాబాద్‌ పోలీసులకు అప్పగించామని డిఆర్‌ఐ అధికారులు చెప్పారు. ఈ ఘటనపై  కేసు నమోదు
చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Other News

Comments are closed.