సెకండ్‌వేవ్‌ ఉండకపోవచ్చు

share on facebook

– మంత్రి ఈటల రాజేందర్‌.

వీణవంక,డిసెంబరు 23 (జనంసాక్షి):తెలంగాణకు కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ భయం లేదని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్‌. ప్రజలు ధైర్యంగా.. అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలో విూడియాతో మాట్లాడిన ఈటల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కంటివిూద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందన్నారు.సెకండ్‌ వేవ్‌ వస్తది అన్న దానికంటే.. చలి కాలం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి.. ఒకవేళ ఏ పరిస్థితి వచ్చిన కూడా దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. వేలాది మందికి ఉపాధిని దూరం చేసి అల్లకల్లోలం సృష్టించిన కరోనా మన దేశంలో ఫస్ట్‌ ఫేజ్‌ కింద పీక్‌ లెవెల్‌కు వెళ్లి కిందికి రావడం జరిగిందని వివరించారు.

Other News

Comments are closed.